వివాదాస్పద హీరోయిన్ రాధికా ఆప్టే నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఎదో ఒక విషయంలో బోల్డ్ కామెంట్స్ చేయడం, తద్వారా పబ్లిసిటీ పొందడం రాధికకు అలవాటే. తెలుగులో రాధికా ఆప్టే లెజెండ్, రక్తచరిత్ర లాంటి చిత్రాలతో మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడ వెబ్ సిరీస్ లతో ఫేమస్ అయిపోయింది. 

ఆయుష్మాన్ ఖురానా నటించిన విక్కీ డోనర్ చిత్రం బాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానాకు జోడిగా యామి గౌతమ్ నటించింది. తాజాగా రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూలో విక్కీ డోనర్ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మొదట ఈ చిత్రంలో హీరోయిన్ గా తననే ఎంపిక చేశారట. 

విక్కీ డోనర్ చిత్రంలో హీరోయిన్ గా నన్ను ఎంపిక చేశారు. సినిమా షూటింగ్ కు ఇంకా సమయం ఉండడంతో విహారయాత్రకు వెళ్ళా. అక్కడ బాగా తిని, బీర్లు ఎక్కువగా తాగా. దీనితో బరువుపెరిగిపోయా. షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి నేను లావు ఎక్కువవడంతో సినిమా నుంచి నిర్మాతలు తొలగించారు. 

కాస్త సమయం ఇస్తే సన్నబడతానని రిక్వస్ట్ చేసినా వినలేదు. మంచి సినిమా కోల్పోయానని భాద నాకు లేదు. ఎందుకంటే అంతకు మించిన సినిమాలు వస్తాయి. కానీ బీర్లు తాగి లావయ్యాననే నెపంతో తొలగించడం వాళ్ళ చిర్రెత్తుకొచ్చింది రాధికా ఆప్టే పేర్కొంది. అప్పటి నుంచి తిండి విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నానని రాధికా ఆప్టే తెలిపింది.