ఇప్పటి వరకు ప్రభాస్‌ మ్యారేజ్‌ కాలేదు. చివరికి ఇదే విషయాన్ని స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే కూడా నిలదీసింది. దీంతో ఏం చెప్పాలో అర్థంకాక తికమకపడుతున్నారు ప్రభాస్‌. మరి ఈ కథేంటో చూస్తే.. 

ప్రభాస్‌(Prabhas) పెళ్లేప్పుడనేది కొన్నేళ్లపాటు ధారావాహికగా వినిపిస్తున్న ప్రశ్న. దానికి ఆయన్నుంచి ఇప్పటి వరకు సమాధానం లేదు. ఆ మధ్య పెదనాన్న కృష్ణంరాజు అమ్మాయిని చూస్తున్నామని చెప్పారు. ఆయన సమాధానం చెప్పీ కూడా మూడేళ్లు దాటిపోయింది. కానీ ఇప్పటి వరకు మ్యారేజ్‌ కాలేదు. చివరికి ఇదే విషయాన్ని స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే(Pooja Hegde) కూడా నిలదీసింది. దీంతో ఏం చెప్పాలో అర్థంకాక తికమకపడుతున్నారు ప్రభాస్‌. మరి ఈ కథేంటో చూస్తే.. 

సోమవారం(ఫిబ్రవరి 14) వాలెంటైన్స్ డే(Valentines Day) సందర్భంగా ప్రభాస్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం `రాధేశ్యామ్‌`(Radheshyam) నుంచి వాలెంటైన్స్ డే గిఫ్ట్ గా గ్లింప్స్ ని విడుదల చేశారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ వాలెంటైన్స్ డే గ్లింప్స్ ని రిలీజ్‌ చేయగా, లవ్‌ ప్రపోజ్‌ నేపథ్యంలో సాగే ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. ఇందులోనే హీరోయిన్‌ pooja Hegde.. Prabhasని ఇంకా పెళ్లేందుకు చేసుకోలేదని ప్రశ్నించింది ప్రభాస్‌. దీంతో సమాధానం చెప్పేందుకు పాన్‌ ఇండియా స్టార్‌ తడబాటు పడటం విశేషం. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

Scroll to load tweet…

`లైఫ్‌లో వాడి మొహం మళ్లీ చూడను` అనే పూజా డైలాగ్‌తో ఈ గ్లింప్స్ ప్రారంభమైంది. ఆ తర్వాత పూజాని కలిసేందుకు ప్రభాస్‌ ప్రయత్నిస్తుంటాడు. ఆ తర్వాత `మన ఆసుపత్రిలో మన పేషెంట్స్ ముందు ముద్దు పెడతానంటావా? అని, ఆ తర్వాత ఓ అమ్మాయికి ప్రభాస్‌ లవ్‌ ప్రపోజ్‌ చేస్తుంటాడు. దీంతో ఆయన ముందుకొచ్చిన పూజా.. ప్రోవోక్‌ చేస్తావ్‌, బాగా మాట్లాడతావ్‌.. ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లేందుకు కాలేదు` అని ప్రశ్నించింది పూజా. దీంతో ఏం చెప్పాలో తెలియక ప్రభాస్‌ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకుంటాయి. 

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన పీరియాడికల్‌ చిత్రం `రాధేశ్యామ్‌`. లవ్‌కి, డెస్టినీకి మధ్య జరిగే స్ట్రగుల్, పోరాటం నేపథ్యంలో సాగే చిత్రమిది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్‌ పతాకాలపై కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్‌, ప్రసీద సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. దాదాపు ఇరవై వేల స్కీన్లలో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ జరుగుతుంది. 

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, టీజర్‌, ట్రైలర్‌, గ్లింప్స్ లు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. విడుదల దగ్గరపడుతున్న నేపథ్యం ఇక నెమ్మదిగా ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేసింది యూనిట్‌. ఈ సినిమాతో టాలీవుడ్‌కే కాదు, యావత్‌ ఇండియా సినిమాలోనూ ఓ ఊపు రాబోతుంది. ఎందుకంటే కరోనా థర్డ్ వేవ్‌ తర్వాత విడుదల కాబోతున్న పెద్ద సినిమా ఇదే. పైగా పాన్‌ ఇండియా చిత్రం కావడంతో దీనిపైనే అందరి చూపుంది.