రామోజీ ఫిల్మ్ సిటీ జనసంద్రంలా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఉన్న డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్  హైదరాబాద్ కి పోటెత్తారు. ఫ్యాన్స్ తో రోడ్లు నిండిపోయాయి. రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Radhe Shyam prerelease event) టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.  

నేడు సాయంత్రం ఐదు గంటల నుండే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ (Prabhas)అభిమానుల సందడి మొదలైంది. ప్రభాస్ రాకకోసం వారు వేయికళ్లతో ఎదురుచూశారు. ఎట్టకేలకు ప్రభాస్ ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఎంట్రీ ఇచ్చారు. లక్షల్లో వచ్చిన అభిమానులు ప్రభాస్ వైపు దూసుకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే మీడియా సంస్థలు, సెలబ్రిటీల సంఖ్యే వందల్లో ఉంది. దీనితో ప్రభాస్ వేదిక వద్దకు చేరుకోవడానికి చాలా కష్టమైంది. 

ప్రభాస్ స్టార్ డమ్ రీత్యా నేషనల్ మీడియా మొత్తం ఈవెంట్ వద్ద తిష్ట వేశారు. రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కవర్ చేయడం కోసం వేదిక వద్దకు చేరుకోవడం జరిగింది. లోకల్, నేషనల్ మీడియాకు సంబంధించిన ఫోటో గ్రాఫర్స్ ప్రభాస్ ని తమ కెమెరాలలో బంధించడానికి పోటీపడ్డారు. బ్లాక్ టీ షర్ట్ ధరించిన ప్రభాస్ రాయల్ ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ రాకను గమనించిన ఫ్యాన్స్ నినాదాలతో గ్రౌండ్ హోరెత్తించారు. చాలా కాలం తర్వాత పబ్లిక్ వేదికలో పాల్గొన్న ప్రభాస్ ని చూసి ఉత్సాహంతో ఉరకలు వేశారు. 

ఇక రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వివిధ పరిశ్రమల ప్రముఖులు హాజరయ్యారు. స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ తో పాటు ప్రాజెక్ట్ కె దర్శకుడు నాగ అశ్విన్ అతిధిగా వచ్చారు. నిర్మాత దిల్ రాజు, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు, ఆయన పెద్దమ్మ గారు సైతం వేడుకకు విచ్చేశారు. ఇక ఐదు భాషల్లో రాధే శ్యామ్ ట్రైలర్ గ్రాండ్ వేదిక సాక్షిగా విడుదల చేశారు. రష్మీతో పాటు హీరో నవీన్ పోలిశెట్టి యాంకర్స్ గా ఈవెంట్ లో జోష్ నింపారు. ముఖ్యంగా నవీన్ తన ఎనర్జీ తో ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. 

Also read Radhe Shyam Pre Release event: నవీన్ పోలిశెట్టి అదిరిపోయే ఎంట్రీ.. రచ్చ రచ్చ చేసిన జాతిరత్నం
రాధే శ్యామ్ మూవీ జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించగా యూవీ క్రియేషన్స్ నిర్మించారు. రాధే శ్యామ్ మూవీలో ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే(Pooja hegde) నటిస్తున్న విషయం తెలిసిందే.