ప్రభాస్ స్టామినా ‘రాధేశ్యామ్’ ఓవర్ సీస్ డీల్ చెప్పేసింది
'బాహుబలి'తో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ 'సాహో' తర్వాత చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ 'రాధ్యేశ్యామ్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. పీరియాడిక్ లవ్‌స్టోరిగా రూపొందుతోన్న ఈ సినిమాకు జిల్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పీరియాడికల్ లవ్‌స్టోరిగా రూపొందుతోన్నఈ చిత్రంలో ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటిస్తుంది. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో రాధేశ్యామ్ ను విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
మన సినిమాలు ఎక్కువగా ఓవర్ సీస్ బిజినెస్ పైనే ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ నిర్మించబడే ప్రతి సినిమా విదేశాల్లో విడుదలై భారీ వసూళ్లను రాబడుతుంటాయి. కొన్ని సినిమాలు రెవిన్యూ పరంగా ఇక్కడ ఘోరంగా దెబ్బతిన్నవి కూడా... ఓవర్ సీస్ కలెక్షన్స్ వల్ల అంతో ఇంతో తెచ్చుకుని బయటపడ్డ చరిత్ర ఉంది. అందుకే మన హీరోలు సైతం అక్కడకు వెళ్లి ప్రమోషన్స్ చేస్తుంటారు. అయితే కరోనా కారణంగా ఓవర్ సీస్ మార్కెట్ మాత్రం కుదేలైంది. త్వరలో మామూలు పరిస్థితులు వస్తాయని భావిస్తున్నప్పటికీ ఓవర్ సీస్ మూవీ మార్కెట్ పై పెద్దగా ఆశలు లేవు. ఈ నేపధ్యంలో రిలీజ్ అవుతున్న పెద్ద తెలుగు సినిమాలు ఓవర్ సీస్ బిజినెస్ ఎలా అని ఆలోచనలో పడ్డారు. అయితే ప్రబాస్ కు ఉన్న క్రేజ్ తో షాకిచ్చే రేటుకు ‘రాధేశ్యామ్’ ఓవర్ సీస్ డీల్ క్లోజ్ అయ్యిందని సమాచారం.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ‘రాధేశ్యామ్’ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని ప్రీమియర్ డిస్ట్రిబ్యూటర్ గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ వారు సొంతం చేసుకున్నారు. వారు 22 కోట్లకు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్న వార్త. ఈ కరోనా టైమ్ లో ఇది అది పెద్ద విషయం. ఇప్పటి వరకు కేవలం ఓవర్ సీస్ సినిమా పంపిణీలోనే అడ్వాన్స్ లేకుండా ఫుల్ పేమెంట్ తో సినిమా బిజినెస్ జరుగుతుంది. ఈ సినిమాకు అలాగే జరిగిందని తెలుస్తోంది.
'బాహుబలి'తో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ 'సాహో' తర్వాత చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ 'రాధ్యేశ్యామ్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. పీరియాడిక్ లవ్‌స్టోరిగా రూపొందుతోన్న ఈ సినిమాకు జిల్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పీరియాడికల్ లవ్‌స్టోరిగా రూపొందుతోన్నఈ చిత్రంలో ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటిస్తుంది. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో రాధేశ్యామ్ ను విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, సత్యరాజ్, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, జగపతిబాబు, జయరాం, సచిన్ ఖేడ్‌కర్, భీనా బెనర్జి, మురళి శర్మ, శాషా ఛత్రి, ప్రియదర్శి, రిద్దికుమార్, సత్యాన్ తదితరులు సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస ఎడిటర్ : కొటగిరి వెంకటేశ్వరావు యాక్షన్, స్టంట్స్ : నిక్ పవల్, సౌండ్ డిజైన్ : రసూల్ పూకుట్టి కొరియోగ్రఫి : వైభవి మర్చంట్ కాస్ట్యూమ్స్ డిజైనర్ : తోట విజయ భాస్కర్ అండ్ ఎకా లఖాని వి ఎఫ్ ఎక్స్ సూపర్‌వైజర్ : కమల్ కన్నన్ ఎక్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ : ఎన్.సందీప్, హెయిర్‌స్టైల్ : రోహన్ జగ్టప్ మేకప్ : తరన్నుమ్ ఖాన్ స్టిల్స్ : సుదర్శన్ బాలాజి పబ్లిసిటి డిజైనర్ : కబిలాన్ పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను కాస్టింగ్ డైరక్టర్ : ఆడోర్ ముఖర్జి ప్రోడక్షన్ డిజైనర్ : రవీందర్ చిత్ర సమర్పకులు : "రెబల్‌స్టార్" డాక్టర్ యు వి కృష్ణంరాజు నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రశీదా దర్శకుడు : రాధాకృష్ణ కుమార్.