మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 151 కోట్ల గ్రాస్ ను రాబట్టిందని నిర్మాతలు అధికారికంగా వెల్లడిస్తూ ఒక పోస్టర్ ను వదిలారు రాధేశ్యామ్ టీమ్. ఈ సినిమా ఇప్పటికే సేఫ్ జోన్‌లోకి ప్రవేశించిందని చెప్తున్నారు. రాధే శ్యామ్ కోసం నిర్మాతలు యువి క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వినికిడి.
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం (Radhe Shyam) రాధేశ్యామ్. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం మార్చ్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే వసూళ్ల పరంగా మాత్రం ప్రభాస్ ఇమేజ్ తో మొదటి మూడు రోజులు బాగానే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైన ఈ సినిమా, తొలిరోజునే 79 కోట్ల గ్రాస్ ను వసూలు చేయగా.. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 151 కోట్ల గ్రాస్ ను రాబట్టిందని నిర్మాతలు అధికారికంగా వెల్లడిస్తూ ఒక పోస్టర్ ను వదిలారు రాధేశ్యామ్ టీమ్. ఈ సినిమా ఇప్పటికే సేఫ్ జోన్‌లోకి ప్రవేశించిందని చెప్తున్నారు. రాధే శ్యామ్ కోసం నిర్మాతలు యువి క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వినికిడి.
ఇందులో డిజిటల్, శాటిలైట్ రైట్స్ నుంచే దాదాపు రూ.200 కోట్లు పెట్టుబడి తిరిగి వచ్చిందని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియో అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం భారీ మొత్తంలో డబ్బు చెల్లించిందట. ఇక మిగిలింది థియేట్రికల్ కలెక్షన్స్ నుండి రాబట్టాలి. కాగా ఇప్పటికే మూడు రోజుల్లో ఆ మొత్తం వచ్చేసింది. దీంతో రాధే శ్యామ్ విషయంలో నిర్మాతలు సూపర్ హ్యాపీగా ఉన్నారట. ఈ నేపధ్యంలో దర్శకుడు రాధాకృష్ణ కుమార్ లేటెస్ట్ గా పెట్టిన పోస్ట్ అయితే వైరల్ అవుతోందని చెప్పాలి.
https://publish.twitter.com/?query=https%3A%2F%2Ftwitter.com%2Fiamgouse7%2Fstatus%2F1503550761472462850&widget=Tweet
ఆ రాధా కృష్ణుల ఫోటోని తన సినిమాలోని మెయిన్ లీడ్ ని సేమ్ స్టిల్ తో చూపించి తన విజన్ ని సినిమాలో ఏ విధంగా పోర్ ట్రే చేసాడో చూపించాడు. అంతే కాకుండా “ఉన్నంత కాలం భూమి ఆకాశం నిలిచేటి గాథే ఈ రాధే శ్యామ్” అని తన డైలాగ్ ని చెప్పుకొచ్చాడు. దీనితో ఈ ఆసక్తికర పోస్ట్ చేసి ప్రభాస్ మరియు మూవీ లవర్స్ మరింత ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు.
