తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా నిర్మితమవుతుందని సమాచారం. ప్రభాస్ స్వయంగా పూనుకుని ఈ ప్రాజెక్టు సెట్ చేసాడంటున్నారు.
ప్రభాస్ హీరోగా వచ్చిన పాన్ ఇండియా సినిమాల్లో 'రాధేశ్యామ్' ఒకటి. ప్రభాస్ - పూజా హెగ్డే హీరో,హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా, భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అదిరిపోయే విజువల్స్ తో ఆశ్చర్యపరిచినా, కథాకథనాల పరంగా అసంతృప్తిని మిగిల్చింది. సినిమా డిజాస్టర్ అయ్యింది. ప్రభాస్ ను సరిగ్గా చూపించడానికి కూడా ట్రై చేయలేదంటూ రాధాకృష్ణపై ప్రభాస్ అభిమానులు విమర్శలు గుప్పించారు. అలాంటి రాధాకృష్ణ కుమార్ ఆ తరువాత ఎక్కడా కనిపించలేదు. ఏ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన పేరు వినిపించలేదు.
కానీ ఆయన గోపిచంద్ హీరోగా ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ గోపిచంద్ కి ఆయన కథ వినిపించడం .. గోపిచంద్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మించనున్నారని చెబుతున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా నిర్మితమవుతుందని సమాచారం. ప్రభాస్ స్వయంగా పూనుకుని ఈ ప్రాజెక్టు సెట్ చేసాడంటున్నారు.
యువి బ్యానర్ లోనే ప్రాణ స్నేహితుడు గోపిచంద్ హీరోగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సెట్ చేసే విధంగా ఆల్మోస్ట్ ప్లానింగ్ మొత్తం జరిగిపోయింది. స్క్రిప్ట్ లాక్ అయ్యాక అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదే కాంబోలో గతంలో జిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం డీసెంట్ సక్సెస్ అందుకుని పేరు తెచ్చింది. జిల్ లో చూపించినంత స్టయిలిష్ గా ఇంకెవరూ చూపించలేదు కాబట్టి మరోసారి రాధాకృష్ణ నుంచి అదే ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అఫీషియల్ అయ్యేదాకా ఇది సస్పెన్సే.
మరి కొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చేస్తుంది. గోపీచంద్ ప్రస్తుతం రామబాణం పూర్తి చేసే పనిలో ఉన్నాడు.గత కొన్నేళ్లుగా వరస పరాజయాలతో మార్కెట్ బాగా దెబ్బ తిన్న తనకు పక్కా కమర్షియల్ బ్రేక్ ఇస్తుందని ఎదురు చూస్తే అటు మారుతీకి సైతం షాక్ కొట్టింది. ఈ పరిణామల నేపథ్యంలో శ్రీవాస్ డైరెక్షన్ లో రాబోతున్న రామబాణం మీద చాలా పాజిటివ్ గా ఉన్నాడు.
