సౌత్‌ సినిమాలపై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానంటూ సోషల్‌ మీడియాలో వస్తోన్న వార్తలపై రాశీఖన్నా స్పందించింది. దీనిపై క్లారిటీ ఇస్తూ ఓ వార్నింగ్‌ నోట్‌ని పంచుకుంది. ఇది వైరల్‌ అవుతుంది.

రాశీఖన్నా(Raashi Khanna) కోపానికి గురైంది. తనపై వస్తోన్న తప్పుడు ప్రచారంపై ఆమె సీరియస్‌ అయ్యింది. దయజేసి ఇకపై ఇలాంటి మానుకోండి అంటూ వార్నింగ్‌ ఇచ్చింది. రాశీఖన్నా సౌత్‌ సినిమాలపై తప్పుడు వ్యాఖ్యలు చేసిందంటూ సోషల్‌ మీడియాలో కొన్ని వార్తలు వైరల్‌ అవుతున్న నేపథ్యంలో రాశీఖన్నా స్పందించింది. ఓ వార్నింగ్‌ నోట్‌ని పంచుకుంది. తనకు అన్ని భాషలు ఒక్కటే అని, అన్ని భాషల్లో తాను పనిచేయాలనుకుంటున్నట్టు పేర్కొంది. 

రాశీఖన్నా చెబుతూ, `దక్షిణాది సినిమాలకు సంబంధించి నా గురించి కొన్ని కల్పిత తప్పుడు కంటెంట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది ఎవరు చేస్తున్నారో దయజేసి ఇంతటితో ఆపేయండి. నేను అన్ని భాషల పట్ల,సినిమాల పట్ల గౌరవంతో ఉన్నాను. అంతే గౌరవంతో పనిచేస్తున్నాను. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఆపేయండి` అంటూ ఓ వార్నింగ్‌ నోట్‌ని పంచుకుంది రాశీఖన్నా.ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

Scroll to load tweet…

అయితే సౌత్‌లో హీరోయిన్లని గ్లామర్‌ డాల్‌గానే చూస్తారని, ఆడియెన్స్, మేకర్స్ సైతం ఇదే అభిప్రాయంతో ఉంటారని ముంబయిలో రాశీఖన్నా ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా వార్తలు గుప్పుమన్నాయి. రాశీఖన్నా హిందీలో అజయ్‌ దేవగన్‌తో కలిసి `రుద్ర` అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఈ సిరీస్‌ ప్రమోషన్‌లో రాశీఖన్నా ఈ కామెంట్లు చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె స్పందించి ఈ వార్తలను ఖండించింది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఆపండి అంటూ మండిపడింది. 

ప్రస్తుతం రాశీఖన్నా తెలుగులో `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తుంది. నాగచైతన్య హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకి విక్రమ్‌ కుమార్‌ దర్శకుడు. ఇది చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతుంది. మరోవైపు గోపీచంద్‌తో `పక్కా కమర్షియల్‌` సినిమా చేస్తుంది. `జిల్‌` తర్వాత గోపీచంద్‌తో చేస్తున్న చిత్రమిది.