సినీ రంగంలో సెలబ్రిటీలకు కాస్త టైమ్ దొరికితే తమ స్నేహితులు, ఫ్యామిలీతో గడుపుతుంటారు. మరీ ఎక్కువ సమయం ఉంటే ట్రిప్ లకు వెళ్తుంటారు. కానీ హీరోయిన్ రాశిఖన్నా మాత్రం టైమ్ దొరికితే ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అందరికీ పార్టీలు ఇస్తుంటుందట.

తన పార్టీలు స్పెషల్ గా ఉండేలా చూసుకోవడం రాశి ప్రత్యేకత అని చెబుతున్నారు. పార్టీ ఎరేంజ్ చేసిన ప్రతీసారి తన గెస్ట్ లకు బోర్ కొట్టకుండా.. సరికొత్త వంటకాలు, డాన్స్ ప్రోగ్రామ్స్, డ్రింక్స్ ఇలా అన్నీ ఉండేలా చూసుకుంటుందట. టాలీవుడ్ లో ప్రభాస్ మాత్రమే ఈ రకంగా పార్టీలు ఇస్తాడని చెప్పుకుంటారు. 

ప్రభాస్ వంటల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడట. భీమవరం వంటకాలతో పాటు సౌత్ ఇండియన్ డిషెస్ స్పెషల్ గా చేయిస్తుంటాడు. చాలా మంది తారలు ప్రభాస్ రాచమర్యాదల గురించి సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.

ఇప్పుడు ప్రభాస్ తరువాత ఆ విధంగా పార్టీలు ఇస్తోంది రాశిఖన్నా అని.. ప్రభాస్ తరువాత ప్లేస్ ఆమెకే దక్కుతుందని అంటున్నారు.