'తొలిప్రేమ' హిట్ కొట్టడంతో తెలుగులో రాశి ఖన్నాను వెతుక్కుంటూ వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె రెండు తెలుగు సినిమాలకి సైన్ చేసేసింది. ఇక తమిళం నుంచి కూడా ఆమెకి వచ్చే అవకాశాలు ఎక్కువగానే వున్నాయి. ఇప్పటికే ఆమె తమిళంలో సిద్ధార్థ్ .. అధర్వ .. జయం రవి కాంబినేషన్లో రూపొందుతోన్న మూడు సినిమాల్లో నటిస్తోంది. 

తాజాగా మరో భారీ చిత్రంలో ఆమెకి చోటు లభించింది .. ఈ సినిమాలో హీరో 'విశాల్'. లైట్ హౌస్ బ్యానర్ వారితో కలిసి విశాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. గతంలో మురుగదాస్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన వెంకట్ మోహన్ .. ఈ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ఆయన రాశి ఖన్నాను ఎంపిక చేసుకున్నాడు. తెలుగులో ఎన్టీఆర్ చేసిన 'టెంపర్' సినిమాకి ఇది రీమేక్.