నయనతార లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌ గా నిలుస్తున్నారు. మరోవైపు రాశీఖన్నా ఇటీవల `ఫర్జీ` వెబ్‌ సిరీస్‌తో హిట్‌ అందుకుని జోరుమీదుంది. అయితే ఇప్పుడు నయనతార చేసిన పనికి.. రాశీఖన్నా లక్కీ ఛాన్స్ అందుకుందనే వార్త వైరల్‌ అవుతుంది.

నయనతార.. లేడీ సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌తో రాణిస్తుంది. పెళ్లై, కవలలకు తల్లి అయినా తర్వాత కూడా తాను సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఆమె సినిమాలు మానేస్తుందనే కామెంట్ల నుంచి ఇప్పుడు కూడా బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో అదే జోరు కొనసాగిస్తూ దూసుకుపోతుంది. తాజాగా ఈ అమ్మడి చేతిలో తొమ్మిది చిత్రాలున్నాయి. హీరోయిన్‌గా ఫుల్‌ బిజీగా ఉంది. 

అయితే ఇప్పుడు నయనతార చేసిన పనికి.. రాశీఖన్నా లక్కీ ఛాన్స్ అందుకోవడం విశేషం. నయనతార తమిళంలో వైనాట్‌ శశికాంత్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమాలో మొదట హీరోయిన్‌గా ఎంపికైంది. ఇది లేడీ ఓరియెంటెడ్‌ ఫిల్మ్. ఇందులో మాధవన్‌, సిద్ధార్థ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే అనుకోని కారణాలతో ఈ చిత్రం నుంచి నయనతార తప్పుకుందట. దీంతో ఆ ఆఫర్‌ రాశీఖన్నాకి వచ్చిందని సమాచారం. 

హీరోయిన్‌ పాత్ర ప్రధానంగానే సినిమా సాగుతుందట. అందుకే నయతారని ఎంపిక చేశారట, కానీ ఆమె అనూహ్యంగా తప్పుకోవడంతో ఆ బంపర్‌ ఆఫర్‌ రాశీఖన్నాకి వరించిందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే నయనతారతోపాటు రాశీఖన్నా కూడా నటిస్తుందని మరో టాక్‌ వినిపిస్తుంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందని, దీనికి `ది టెస్ట్` అనే టైటిల్‌ని కూడా నిర్ణయించారట. త్వరలోనే ప్రారంభమవుతుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే గతంలో నయనతార, రాశీఖన్నా కలిసి `అంజలి సీబీఐ` చిత్రంలో నటించారు. మరి ఈ కాంబో మళ్లీ రిపీట్‌ అవుతుందా? లేదా? అనేది చూడాలి.

ఇటీవల రాశీఖన్నా తమిళంలో `సర్దార్‌` చిత్రంలో నటించింది. ఇది పెద్దగా ఆడలేదు. రాశీఖన్నా ఇటీవల `ఫర్జీ` అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఇది పెద్ద హిట్‌ అయ్యింది. ఈ బ్యూటీకి మంచి పేరొచ్చింది. దీంతో రాశీఖన్నాకి మంచి ఆఫర్లు వస్తాయని, హిందీలో బిజీ అవుతుందని భావించారు. ఆ రిజల్ట్ ఇంకా కనిపించడం లేదు. కానీ ఇప్పుడు కోలీవుడ్‌ ఆఫర్‌ రావడం విశేషం. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలను రాశీ మోయగలదనే నమ్మకం మేకర్స్ కి కలిగిందంటే కచ్చితంగా అది `ఫర్జీ` వెబ్ సిరీస్‌ ప్రభావం ఉంటుందని చెప్పొచ్చు. 

ఇక ఇప్పటికే రాశీఖన్నా బిజీగానే గడుపుతుంది. ఆమె హిందీలో నటించిన `యోధ` చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. తాజాగా దీనికి సంబంధించిన డబ్బింగ్‌ వర్క్ లో పాల్గొంది రాశీఖన్నా. దీంతోపాటు కొచ్చిలో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుంది. రాశీఖన్నా తెలుగులో చివరగా `పక్కా కమర్షియల్‌`, `థ్యాంక్యూ`చిత్రాల్లో నటించి పరాజయాలు మూటగట్టుకుంది.