ఒక కథను అనుకుంటే అది తెరపై ఎంతవరకు తెరకెక్కుతుందో చెప్పలేము. ముఖ్యంగా బడా సినిమాలు చాలా వరకు కథ చర్చల వద్దే ఆగిపోతాయి. కొన్ని బడ్జెట్ కారణాల వల్ల రిస్క్ తీసుకోవద్దని అనుకుంటారు. ఇకపోతే ప్రస్తుతం రానా హిరణ్యకసిప పరిస్థితి కూడా అలానే ఉందని కొన్ని రూమర్స్ వచ్చాయి. 

దర్శకుడు గుణశేఖర్ చెప్పిన ఆ కథకు ముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రానా తానే నిర్మాతగా మారి సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. ముందుగానే హిరణ్యకసిప టైటిల్ ను కూడా రిజిస్ట్రేషన్ చేశారు. అయితే నెలలు గడుస్తున్నా ఇంకా ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. 

అసలు గుణశేఖర్ ఎంతవరకు ప్లాన్ చేసుకున్నాడు అనే విషయంలో క్లారిటీ రాలేదు. అయితే రీసెంట్ గా సురేష్ బాబు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అదుగో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. 

రానా హిరణ్యకసిప సినిమాను నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో తెరకెక్కించాలని  ప్లాన్ చేస్తున్నాడట. తమ స్టూడియోలోనే కాకుండా లండన్ కు సంబందించిన ప్రొడక్షన్ హౌస్ లలో కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్లు తెలిపారు. అంతే కాకుండా విఎఫ్ఎక్స్ సినిమాలంటే రానాకీ బాగా ఇష్టమని చెప్పిన సురేష్ బాబు త్వరలోనే ఆ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకర్షించేలా నిర్మిస్తాడని తెలిపారు.