ఈ నేపథ్యంలో హీరో కార్తికేయ అసలు సీక్రెట్‌ రివీల్‌ చేశారు. ఎవరికీ ఎలాంటి రిస్క్ లేకుండా తాను చేసుకోబోతున్న లోహిత గురించి వివరాలు వెల్లడించారు. 

`ఆర్‌ఎక్స్ 100` ఫేమ్‌ హీరో కార్తికేయ సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని షాకిచ్చాడు. ఆయన ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో తలుక్కుమనడంతో అభిమానులే కాదు, చిత్ర వర్గాలు కూడా షాక్ అయ్యారు. అయితే తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు? ఎలా కలిశారు, బంధువుల అమ్మాయా? లేక లవ్వా అంటూ నెటిజన్లు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఆ అమ్మాయి గురించి అన్వేషించే పనిలో బిజీ అయ్యారు. 

ఈ నేపథ్యంలో హీరో కార్తికేయ అసలు సీక్రెట్‌ రివీల్‌ చేశారు. ఎవరికీ ఎలాంటి రిస్క్ లేకుండా తాను చేసుకోబోతున్న లోహిత గురించి వివరాలు వెల్లడించారు. `నిట్‌ వరంగల్‌లో 2010లో తొలిసారి లోహితను కలిశాను. అప్పటి నుంచి నేటి దాకా.. దశాబ్దకాలంగా ఎన్నో మధుర జ్ఞాపకాలు. ఇక ముందు కూడా అలాంటి మధుర క్షణాలే. నా ప్రాణ స్నేహితురాలితో నాకు నిశ్చితార్థం జరిగింది. తను నా జీవిత భాగస్వామి కాబోతోంది` అంటూ కార్తికేయ అభిమానులతో పంచుకున్నాడు. 

Scroll to load tweet…

బెస్ట్‌ఫ్రెండ్‌ లోహితతో త్వరలోనే తన వివాహం జరుగనుందని సోమవారం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన చేశాడు. ఈ సందర్భంగా తమ పాత, ప్రస్తుత ఫొటోలను షేర్‌ చేశాడు. ఈ క్రమంలో కాబోయే వధూవరులకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా లోహిత కార్తి​కేయ కుటుంబానికి దగ్గరి బంధువు అని సమాచారం. ఇక `ఆర్‌ఎక్స్‌ 100` మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ.. `గుణ 369`, `చావు కబురు చల్లగా` వంటి సినిమాలతో పలకరించాడు. నానీ `గ్యాంగ్‌లీడర్‌` మూవీలో విలన్‌గా ఆకట్టుకున్న అతడు.. ప్రస్తుతం అజిత్‌ `వాలిమై`, `రాజా విక్రమార్క` అనే చిత్రాల్లో నటిస్తున్నాడు.