కొన్ని క్రేజీ కాంబినేషన్లు మళ్ళీ మళ్ళీ రిపిట్ అయితే బాగుండుఅనుకుంటారు ఆడియన్స్. ఫ్యాన్స్ కూడా తమ అభిమాన నటుడికి హిట్ ఇచ్చిన దర్శకుడితో.. మళ్లీ సినిమా చేస్తే బాగుండు అని అభిప్రాయా పడతారు. ఇక తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా.. తనహిట్ డైరెక్టర్ ను రిపిట్ చేయబోతున్నాడట. 

ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ స్క్రీన్ మీద అలరించింది లేదు. పోయిన్ ఏడాది మార్చ్ లో ఆర్ఆర్ఆర్ తో ఆడియన్న్ ముందుకు వచ్చిన తారక్.. ఈ సారి ఎన్టీఆర్ కీ .. అభిమానులకు మధ్య చాలానే గ్యాప్ వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన తారక్ నుంచి ఇప్పటి వరకూ ఒక్క సినిమా థియేటర్లో లేదు. ఇక ఇప్పుడు చేస్తున్న దేవర కూడా వచ్చే ఏడాదిసమ్మర్కు రిలీజ్ అవుతుండటంతో.. ఇక తారక్ నుంచి రెండేళ్లు గ్యాప్ ను ఫ్యాన్స్ భరించలేకపోతున్నారు. 

ఇక ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేయడానికి..వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు తారక్. అందులో భాగంగా ప్లాన్ చేస్తున్నాడు. అనుకున్న సమయానికి కొరటాల ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లకపోవడం వలన ఇలా జరిగింది. దాంతో ఇకపై తన నుంచి వరుస సినిమాలు థియేటర్స్ కి వెళ్లేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. 

ఆయన తాజా సినిమా దేవర కొరటాలతో చేస్తున్న సినిమా సెట్స్ పై ఉంది. కెరియర్ పరంగా ఇది ఆయనకి 30వ సినిమా. 31వ సినిమాను ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందనుంది. ఇక 32వ సినిమాగా బాలీవుడ్ మూవీ వార్ 2 ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

ఒకవేళ వార్ 2 సెట్స్ పైటకి వెళ్లడం ఆలస్యమైతే, సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలోనే ఎన్టీఆర్ కి సుకుమార్ ఒక కథను వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. నాన్నకు ప్రేమతో తరువాత వాళ్లు చేయనున్న సినిమా ఇదే. ఈ లోగా విజయ్ దేవరకొండతో అనుకున్న ప్రాజెక్టును సుకుమార్ పూర్తిచేస్తాడని తెలుస్తోంది. మరి నాన్నకు ప్రేమతో కాంబినేఫన్ లో ఈసారి ఎలాంటిసినిమా వస్తుందో చూడాలి.