బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ ఫెక్ట్, `త్రీ ఇడియట్‌` స్టార్‌ అమీర్‌ఖాన్‌కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో `త్రీ ఇడియట్‌` స్టార్‌ మాధవన్‌కి కూడా కరోనా సోకిందట. గురువారం మాధవన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఆయన చాలా ఫన్నీగా ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా పేర్కొనడం విశేషం. `రాంచో(త్రీ ఇడియల్స్`లోని అమీర్‌ పాత్ర పేరు)ను ఫర్హాన్‌(మాధవన్‌ పేరు) ఫాలో అవుతుంటే, వైరస్‌(బొమన్‌ ఇరానీ) మా ఇద్దరి వెంట పడేవాడు. కానీ ఈ సారి వాడికి(కరోనా వైరస్‌)కి మేం చిక్కాం. ఆల్‌ ఈజ్‌ వెల్‌. త్వరలోనే కరోనా వైరస్‌కి కూడా చెక్‌ పడుతుంది` అని అన్నారు. 

ఇంకా చెబుతూ, మాతో పాటు రాజు(శర్మన్‌ జోషి) రాకూడదని భావిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. నా ఆరోగ్యం చాలా బాగుంది` అని చెప్పారు మాధవన్. కరోనా వైరస్‌ తనకి సోకినా కూడా ఇలా సరదాగా మాధవన్‌ స్పందించడం విశేషం. ఇక ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. మరోవైపు అమీర్‌ ఖాన్‌ కూడా హోం క్వారంటైన్‌ అయిపోయారు. `రాకెట్రీ` చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల `నిశ్శబ్దం`లో నెగటివ్‌ రోల్‌ చేసిన విషయం తెలిసిందే.