ఒకప్పుడు లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు మాధవన్ కి ఇప్పటికీ ఆ క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదు. అందుకే ఓ యువతి అతడిని పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేసింది. అసలు విషయంలోకి వెళితే.. మంగళవారం నాడు మాధవన్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ సెల్ఫీ పోస్ట్ చేశారు.

దానికి 'ఎడిటింగ్ చాలా కష్టంతో కూడుకున్న పని. మరోపక్క ఫన్నీగానూ ఉంటుంది. రోజంతా ట్రావెల్ చేసొచ్చా.. నేను వృద్ధుడిని అయిపోతున్నా' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటో చూసిన ఓ అమ్మాయి కామెంట్ చేస్తూ.. 'నాకు 18 ఏళ్లు.. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా.. తప్పంటారా..?' అని ప్రశ్నించింది.

దీనికి మాధవన్ స్పందిస్తూ.. 'హ్హ.. హ్హా.. గాడ్ బ్లెస్ యూ.. నాకంటే బెటర్ పెర్సన్ మీకు తప్పకుండా దొరుకుతాడు' అని బదులిచ్చాడు. మాధవన్ కి అమ్మాయిల్లో క్రేజ్ తగ్గలేదనడానికి ఇదొక ఉదాహరణ. ప్రస్తుతం మాధవన్ 'రాకేట్రీ: ది నంబీఎఫెక్ట్' అనే సినిమాతో బిజీగా ఉన్నారు.

ఇందులో ఆయన ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో పాటు 'నిశ్శబ్దం' అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు.