ఆమె ఛాలెంజ్ కు అఖిల్ ధీటైన సమాధానం!

First Published 23, May 2018, 10:39 PM IST
PV Sindhu Challenged Akhil and Look What He Did
Highlights

'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' అనే పేరుతో పివి సింధు విసిరిన సవాల్ ను

'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' అనే పేరుతో పివి సింధు విసిరిన సవాల్ ను స్వీకరించిన అక్కినేని అఖిల్ ఫిట్ నెస్ కసరత్తులు చేసే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తదుపరి ఛాలెంజ్ కోసం నటుడు అక్కినేని నాగార్జున, వరుణ్ ధావన్, దుల్కర్ సల్మాన్ లను నామినేట్ చేశారు.

భారతీయులందరూ ఫిట్ గా ఉండాలనే ఉద్దేశంతో కేంద్రమంత్రి ఈ ఛాలెంజ్ ను మొదలుపెట్టారు. ప్రధాని నరేంద్ర మోది హార్డ్ వర్క్, అతని శక్తి చూసి స్ఫూర్తి పొందిన కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ దేశ ప్రజలంతా ఫిట్ గా ఉండాలని మోది అభిలాష అంటూ ఆయన కసరత్తులు చేసిన వీడియోను షేర్ చేస్తూ కొందరు సెలబ్రిటీలను నామినేట్ చేశారు. ఆ విధంగా సోషల్ మీడియాలో ఈ ఛాలెంజ్ సర్క్యులేట్ అవుతుంది. 

 

loader