హీరోయిన్ గా, విల‌న్ గా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించి, మెప్పించి గుర్తింపు తెచ్చుకున్న న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్. తమిళ స్టార్ నటుడు శరత్ కుమార్ కుమార్తె అయిన వరలక్ష్మి చాలా బోల్డ్ గా ఉంటుందనే విషయం తెల్సిందే. హీరోయిన్ గా నటిస్తూనే నటనకు ఆస్కారం ఉండే విలన్ పాత్రలు చేస్తున్న ఆమెకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపే ఉంది. ఉన్న విషయం ముక్కు సూటిగా ,దాపరికం లేకుండా కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పటంలో ఆమెకు ఆమే సాటి. కీలక పాత్రలను చేస్తూన్న ఈ మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె రెగ్యులర్ గా చేసే కామెంట్స్ మరియు పోస్ట్ లు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఆమె చేసిన పోస్ట్ మరోసారి వైరల్ అయ్యింది.
 
ఇంతకీ ఆ పోస్ట్ ఏమిటంటే.. కరోనా సమయంలో మాస్క్ ధరించాలని. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు ఇదే విషయమై మాట్లాడారు. మాస్క్ ల యొక్క ప్రాముఖ్యతను ఒకొక్కరు ఒక్కో రకంగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొదటే చెప్పుకున్నాం కదా వరలక్ష్మి చాలా విభిన్నంగా ఉంటుంది. తాజాగా మాస్క్లకు సంబంధించిన ప్రాముఖ్యతను వివరించింది. 

ఒక ఫొటోను షేర్ చేసిన ఆమె మాస్క్ యొక్క ప్రాముఖ్యతను కాస్త  బోల్డ్ గా చెప్పింది. ఆ ఫొటోలో ఏముందంటే..ప్యాంట్ ధరించి మూత్రం పోస్తే ప్యాంట్  లో పడుతుంది. ఎదురుగా వ్యక్తి ఉన్నప్పుడు పాయింట్ విప్పి మూత్రం పోస్తే ఆ ప్యాంట్ తడుస్తుంది. అదే ఇద్దరు ప్యాంట్లు లేకుండా ఉంటే ఇద్దరు కూడా తడుస్తారు. అదే ఇద్దరు ప్యాంట్లు ధరిస్తే ఒక్కరికే ప్రమాదం. అందుకే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని బోల్డ్ గా వరలక్ష్మి పోస్ట్ చేసింది. 

ప్రస్తుతం వ‌ర‌ల‌క్ష్మి మ‌రో కొత్త ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్ట‌నున్నారు. ద‌ర్శ‌కురాలిగా త‌న‌ను తాను నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ దర్శకత్వంలో తెన్నాండాల్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై రామ‌స్వామి నిర్మాత‌గా ‘కన్నామూచి’అనే సినిమా రూపొందనుంది. తెలుగులో దాగుడుమూతలుగా రానుంది.