ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంతో వచ్చిన ‘పుష్ఫ’ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. మరోవైపు సాంగ్స్ కూడా ఊపూపాయి. తాజాగా Pushpaలోని శ్రీవల్లి సాంగ్ య్యూటూబ్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.  

అల్లు అర్జున్ పుష్ప (Pushpa) సృష్టించిన సంచలనాలు మరో సినిమాకు సాధ్యం కాలేదనే చెప్పాలి. ఇటీవల కేజీఎఫ్ ఛాప్టర్ 2 వచ్చినా సాంగ్స్ పరంగా పుష్ప ఎక్కువ రీచ్ ను సంపాదించుకోగలింది. ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా పేరు వినిపించింది. మరీ ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా అన్ని ఏజ్ గ్రూప్స్ వారు పుష్ప సినిమా సాంగ్స్, డైలాగ్స్ ను సెలబ్రేట్ చేశారు. ఇప్పటికీ ఈ మానియా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఫేమస్ స్పోర్ట్స్ స్టార్స్ కూడా పుష్ప స్టైల్ ను ఫాలో అయ్యారు. దీంతో పుష్ప మూవీ ఇండియన్ సినిమా హిస్టరీలో ఐకానిక్ మూవీగా నిలిచిపోయింది.

అయితే, ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ క్యాచీ ట్యూన్ ను అన్ని సాంగ్స్ కు అందించడంతో పాటలు రికార్డు క్రియేట్ చేస్తున్నాయి. పుష్పలోని ‘ఊ అంటవా మావా.. ఉఉ అంటవా మావా’ స్పెషల్ సాంగ్ కూడా ప్రభంజనం స్రుష్టించింది. తాజాగా శ్రీవల్లి (Srivalli Song) హిందీ వెర్షన్ సరికొతద్త రికార్డు క్రియేట్ చేసింది. య్యూటూబ్ లో 400 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించుకున్న ఈ సాంగ్ గ్లోబల్ టాప్ నెం.1 మ్యూజిక్ వీడియోగా ట్రెండింగ్ లో ఉంది. తెలుగు సినిమా నుంచి వచ్చిన పాటల్లో ఇంత క్రేజ్ ఉన్న సాంగ్ ఇదే అని చెప్పాలి. 

శ్రీవల్లి సాంగ్ కు తెలుగులో ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ అద్భుతమై లిరిక్స్ అందించారు. దేవీ శ్రీప్రసాద్ మెలోడీ ట్యూన్ కంపోజ్ చేయగా.. లవ్ సాంగ్స్ స్పెషలిస్ట్, స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ (Sid Sriram) గాత్రం అందించారు. హిందీలో రక్వీబ్ అలామ్ లిరిక్స్ అందించగా.. జావెద్ అలీ పాడారు. ఈ సాంగ్ కు అల్లు అర్జున్, రష్మిక మందన్న (Rashmika Mandanna) అద్బుతంగా ఆడారు. ప్రస్తుతం పుష్ప : ది రైజ్ చిత్ర యూనిట్ దీనికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప : ది రూల్ (Pushpa : The Rule) చిత్ర షూటింగ్ లో నిమగ్నమయ్యయారు. అల్లు అర్జున్ అభిమానులు, ప్రేక్షకులు పార్ట్ 2 కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

Scroll to load tweet…