కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు పుష్ప రాజ్. అన్ని భాషల్లో దూసుకుపోతుంది పుష్ప మూవీ. సినిమా విషయంలో యావరేజ్ టాక్ వచ్చినా.. కలెక్ష్స్ విషయంలో మాత్రం దూసుకుపోతుంది సినిమా..ల

కలెక్షన్స్ విషయంలో త‌గ్గేదే లే అంటున్నాడు పుష్ప రాజ్..వసూళ్ల సునామీతో పుష్ప దూసుకుపోతున్నాడు. అల్లు అర్జున్(Allu Arjun )- రష్మిక(Rashmika) జంటగా.. జీనియస్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబినేష‌న్‌లో తెరకెక్కిన 'పుష్ప' (Pushpa) డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. నైజాంలో తొలి రోజే బాహుబ‌లి-2 వ‌సూళ్ల‌ రికార్డులను తిరగరాసిన పుష్ప.. ఆలిండియా రికార్డు సృష్టించింది ఇప్పుడు 'పుష్ప'... రెండో రోజు కూడా ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌సూళ్ల ప‌రంగా రెచ్చిపోతోంది.


ఇప్పుడు పుష్పకు కలిసొచ్చిన అంశం వీకెండ్. ఈ వీకెండ్ శనివారం రెండోవరోజు కావడంతో కలెక్షన్ల జోరు కనిపించింది. సినిమాను చూసేందుకు అభిమానులు భారీగా ఎగ‌బ‌డ్డారు. బాక్సాఫీస్ దగ్గర పుష్ప రాజ్ ప్రతాపం ఏమత్రం తగ్గలేదు. శనివారంతో ఇంకా పెరిగింది. రికార్డు స్థాయిలోఆలిండియా లెవల్లో వ‌సూళ్లు రాబ‌ట్టింద‌ని మైత్రి మూవీస్ ప్ర‌క‌టించింది.ఇప్పటికే ప్ర‌పంచ వ్యాప్తంగా 116 కోట్ల గ్రాస్ రాబ‌ట్టింది పుష్ప. ఈ విషయాన్ని మైత్రీ మూవీస్ పోస్టర్ ద్వారా అనైన్స్ చేశారు.

హిందీలోనూ పుష్ప సినిమా దూసుకుపోతోంది. మొద‌టి రోజు హిందీలో రూ.3.05 కోట్లు, రెండో రోజు రూ.4.02 కోట్లు రాబ‌ట్టింది. రెండు రోజుల్లో హిందీలో మొత్తం రూ.7.07 కోట్ల నెట్ సాధించింది. శనివారం పరిస్థితే అలా ఉంటే ఇక ఈరోజు ఆదివారం కావ‌డంతో పుష్ప కలెక్షన్ల జోరు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆరోజు టికెట్స్ అన్నీ ఎప్పుడో బుక్ అయిపోయాయి అంటే.. సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ కరోనా పాండమిక్ టైమ్ లో కూడా పుష్ప ఈరేంజ్ కలెక్షన్స్ సాధిచడం.. ఇండస్ట్రీకి బలాన్నిస్తుంది. అఖండ ఇండస్ట్రీకి ధైర్యాన్నిస్తే.. పుష్ప ఇంకా బూస్టప్ ఇస్తోంది.

Also Read : BUNNY-BOYAPATI : ఇక అఖండ- పుష్ప కాంబినేషన్ కు లైన్ క్లియర్.. గతంలోకి వెళ్ళబోతున్న అల్లు అర్జున్