Asianet News TeluguAsianet News Telugu

Pushpa OTT: ‘పుష్ప: ది రైజ్’ ఏ ఓటీటి లో .. రిలీజ్ డేట్‌ ?

కరోనా మళ్లీ విజృంభిస్తూండటంతో అందరూ ధియేటర్ కు వెళ్లి సినిమా చూసే పరిస్దితి లేదు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటీటి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Pushpa OTT Platform And Tentative Release Date
Author
Hyderabad, First Published Dec 17, 2021, 6:13 PM IST

మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ థియేటర్స్ లోకి ఈ రోజే (శుక్రవారం) వచ్చింది. తగ్గేదేలే .. అంటూ విడుదలకు ముందు తెగ  హడావిడి చేసిన అల్లు అర్జున్ .. ఈ సినిమాతో మాట నిలబెట్టుకున్నాడు. ఫ్యాన్స్ కి మంచి మాస్ ఫీస్ట్ ఇచ్చాడు.  ‘పుష్ప’ కోసం దర్శకుడు సుకుమార్‌ ‘ఎర్రచందనం’ స్మగ్లింగ్‌ నేపథ్యాన్ని, మాస్‌లో మంచి క్రేజ్‌ ఉన్న అల్లు అర్జున్‌ని హీరోగా ఎంచుకున్నాడు. ఈ పాయింటే ‘పుష్ప’పై ఎక్సపెక్టేషన్స్ ఏర్పడేలా చేసింది. అందుకు తగినట్లుగానే ప్రేక్షకులను మెప్పించేలా కథ, కథనాలను తీర్చిదిద్దడంలో సుకుమార్‌ కొంతవరకు సఫలమయ్యాడు.

 ఎర్ర‌చంద‌నం ఎంత విలువైందో, అది మ‌న శేషాచ‌లం అడ‌వుల నుంచి జ‌పాన్ వ‌ర‌కు ఎలా ప్ర‌యాణం చేస్తుందో చెబుతూ ఆరంభ స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు సుకుమార్‌. ఆ తర్వాత నుంచి ఆ ఎర్ర చందనం చుట్టూ తిరిగే స్మగ్లింగ్ యాక్టివిటీస్ గురించి కథనం సాగింది. ఓ వర్గానికి ఈ సినిమా బాగా నచ్చింది. అయితే కరోనా మళ్లీ విజృంభిస్తూండటంతో అందరూ ధియేటర్ కు వెళ్లి సినిమా చూసే పరిస్దితి లేదు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటీటి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా అమేజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. థియోటర్ రిలీజ్ కు ముందే రైట్స్ భారీ మొత్తానికి అమేజాన్ కొనుగోలు చేసింది. అయితే రిలీజ్ కు ముందు ఎక్కడా ఈ విషయం బయిటకు లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయం ఇవాళ సినిమా క్రెడిట్స్ సమయంలో బయిటకు వచ్చింది. ఎక్సక్లూజివ్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమేజాన్ సొంతం చేసుకుంది. సాధారణంగా పెద్ద సినిమా రిలీజ్ అయిన నాలుగు లేదా ఆరు వారాల తర్వాత ఓటీటిలో వచ్చేలా ఎగ్రిమెంట్ చేసుకుంటారు. నాలుగు వారాల ఎగ్రిమెంట్ అయితే పుష్ప చిత్రం జనవరి 14 నుంచి రిలీజ్ కానుంది.
 
 శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో బన్నీ హీరోగా నటించారు.  ‘పుష్ప: ది రైజ్‌’ అల్లు అర్జున్‌ వన్‌ మ్యాన్‌ షో అని చెప్పవచ్చు. కథ మొదలైన దగ్గరి నుంచి పుష్పరాజ్‌ పాత్రను ఎలివేట్‌ చేస్తూ తెరకెక్కించిన సన్నివేశాలు అద్భుతంగా అలరిస్తాయి. మాస్‌ లుక్‌లోనే కాదు నటనలోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టేశాడు. ఏ సన్నివేశం చూసిన ‘తగ్గేదేలే’ అంటూ ఫ్యాన్స్‌తో విజిల్స్‌ వేయించాడు. చిత్తూరు యాస్‌లో బన్ని పలికిన సంభాషణలు అలరిస్తాయి. శ్రీవల్లిగా డీగ్లామర్‌ పాత్రలో రష్మిక నటన సహజంగా ఉంది.  రష్మిక హీరోయిన్. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మించింది.

Follow Us:
Download App:
  • android
  • ios