అల్లు అర్జున్ యూటర్న్.. నానికి షాక్ అంటూ ఊహాగానాలు

అల్లు అర్జున్ పుష్ప చిత్రం పోస్ట్ పోన్ కానుందనే వార్తలు జోరందుకున్నాయి. పుష్ప రిలీజ్ డేట్ వ్యవహారం నేచురల్ స్టార్ నానికి తలనొప్పి వ్యవహారంలా మారినట్లు తెలుస్తోంది. 

 

Pushpa movie postpone rumours gives shock to nani

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప చిత్రంపై కనీవినీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ నుంచి రాబోతున్న తొలి పాన్ ఇండియా మూవీ ఈ చిత్రం. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ మూవీ ఈ చిత్రాన్ని చెక్కుతున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరుతో రిలీజ్ కానుంది. 

కరోనా పరిస్థితులు చక్కబడడంతో రెడీగా ఉన్న చిత్రాలన్నీ ఒక్కసారిగా రిలీజ్ అవుతున్నాయి. దీనితో రిలీజ్ డేట్ల సమస్య తీవ్రంగా ఉంది. సంక్రాంతికి రాధేశ్యామ్, భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలు పోటీ పడుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. Allu Arjun పుష్ప చిత్రాన్ని కూడా రిలీజ్ డేట్ సమస్య వెంటాడుతోంది. ముందుగా ఈ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత విడుదల తేదీ మార్చుతూ డిసెంబర్ 17నే ముందుగా రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటిచారు. 

దీనితో క్రిస్టమస్ స్లాట్ ఖాళీగా ఉండడంతో నాని ' Shyam Singha Roy' చిత్రం ఆ తేదీని ఖరారు చేసుకుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం నానికి అల్లు అర్జున్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. Pushpa చిత్రం డిసెంబర్ 17న విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదట. ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో పుష్ప రిలీజ్ ఆలస్యం కానున్నట్లు ప్రచారం జోరందుకుంది. దీనితో ముందుగా అనుకున్న క్రిస్టమస్ రోజునే విడుదల చేయాలనే ఆలోచనలో బన్నీ అండ్ టీం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే నానికి షాక్ తప్పదు. 

Also Read: ఈషా రెబ్బా చామంతి పూల ముద్దులు ఎవరికోసమో.. మెస్మరైజ్ చేస్తున్న క్రేజీ పిక్స్

ఒక వేళ పుష్ప డిసెంబర్ 25న రిలీజ్ ఖరారు చేసుకుంటే నాని తన శ్యామ్ సింగరాయ్ రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటాడా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఇటీవల ఓ వేదికపై నాని మాట్లాడుతూ క్రిస్టమస్ ముందు సందడి బన్నీ, సుకుమార్ ల పుష్ప చిత్రానిది.. క్రిస్టమస్ తర్వాత ఆర్ఆర్ఆర్ సందడి.. కానీ క్రిస్టమస్ మాత్రం మనదే అంటూ కామెంట్స్ చేశాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సంస్కృత్యాన్ తెరకెక్కించాడు. ఈ మూవీలో నానికి జోడిగా కృతి శెట్టి, సాయి పల్లవి నటిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios