కొన్ని పోలికలు అర్దవంతంగా ఉంటే..మరికొన్ని విచిత్రంగా ఉంటాయి. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్పని బాలయ్య సినిమాతో పోలుస్తూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా మరేదో కాదు..ఎన్టీఆర్ బయోపిక్. ఆ మధ్యన బాలయ్య తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు  జీవిత చరిత్రని రెండు పార్ట్ లుగా చేసారు. మొదట ఒకటే సినిమా అనుకున్నది కాస్తా ఆ తర్వాత  రెండు పార్ట్ లు  కథానాయకుడు , మహానాయకుడు అయ్యింది. బాహుబలి ప్రేరణతో కమర్షియల్ గా వర్కవుట్ అవుతుందని అలా రెండు భాగాలు చేసారని చెప్పుకున్న్రారు. అలా ఎన్టీఆర్ బయోపిక్ రెండు  భాగాలు అవడంతో ఫలితానికి డిజాస్టర్ అయ్యింది. ఆ విషయం ఇప్పుడు జనాలు గుర్తు చేస్తున్నారు.  
 
అప్పుడు బాలకృష్ణ - క్రిష్ లు చేసిన తప్పే ఇప్పుడు సుకుమార్ - బన్నీ లు చేస్తున్నారంటున్నారు. మొదట ఒకే స్క్రిప్టుగా అనుకుని మొదలెట్టిన పుష్ప...ఇప్పుడు  రెండు పార్ట్ లు గా విడుదల చేద్దామని డిసైడ్ అయ్యారు. దాంతో  పుష్ప రెండు పార్ట్ లకి వెళ్లడం అనేది రిస్క్ అవుతుంది అంటూ,బాలయ్య సినిమాతో పోలిక పెడుతున్నారు. అయితే అర్దం పర్దం లేని విషయం. స్క్రిప్టు రెండు భాగాలుగా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అందుకు తగ్గ జాగ్రత్తలు సుకుమార్ తీసుకుంటాడంటున్నారు. 

ఆగష్టు 13 న పుష్ప పార్ట్ వన్ రిలీజ్ కి డేట్ ఇచ్చేసి.. పుష్ప సినిమా షూటింగ్ చేసారు. కానీ అల్లు అర్జున్ కి కరోనా రావడంతో పుష్ప సినిమా షూటింగ్ కి తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. 
 
ఇక  పుష్ప సినిమా ఎప్పుడైతే రెండు పార్ట్ లుగా రిలీజ్ కాబోతుంది అని తెలిసిందో అప్పటినుండి సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అల్లు అర్జున్ సుకుమార్ లు ఈ సినిమాని ఏ రేంజ్ లో చూపిస్తారో అని. ఇక పార్ట్ వన్ ఆగష్టు 13 న రిలీజ్ అవుతుంటే.. రెండో పార్ట్ 2022 సమ్మర్ అంటున్నారు. అంటే ఇప్పటికే ప్రభాస్ సలార్, ఎన్టీఆర్ - కొరటాల  ఎన్టీఆర్ 30, మహేష్ - త్రివిక్రమ్ కాంబో ఫిల్మ్  లు 2022 సమ్మర్ ని టార్గెట్ చేశాయి. మరి ఇప్పుడు పుష్ప పార్ట్ 2 తో అల్లు అర్జున్ కూడా సమ్మర్ రేసులోకి వచ్చేస్తున్నాడు.