`పుష్ప` కేవలం హిందీ వెర్షన్‌ మాత్రమే 80కోట్లు వసూలు చేయడం విశేషం. తాజాగా బాలీవుడ్‌ సినీ క్రిటిక్‌ తరణ్‌ ఆదర్శ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఏ హిందీ సినిమాకి సాధ్యం కాని విధంగా ఈ చిత్రం అక్కడ భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది.

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన `పుష్ప` ఫస్ట్ పార్ట్ గత నెలలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఏకంగా రూ.325కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. సినిమాకి మొదటి రోజు మిశ్రమ స్పందన లభించింది. నిడివి ఎక్కువగా ఉందని, సాగతీతగా ఉందని, డబ్బింగ్‌ సరిగా సెట్‌ కాలేదని, ఎలివేషన్‌ సీన్లు పండలేదనే విమర్శలు వచ్చాయి. కానీ అవేవీ సినిమాని ఆపలేకపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. విడుదలై 24 రోజులకుగానూ ఈ సినిమా 325కోట్లు(గ్రాస్‌) కలెక్ట్ చేసిందని టాక్.

ఇదిలా ఉంటే `పుష్ప` కేవలం హిందీ వెర్షన్‌ మాత్రమే 80కోట్లు వసూలు చేయడం విశేషం. తాజాగా బాలీవుడ్‌ సినీ క్రిటిక్‌ తరణ్‌ ఆదర్శ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఏ హిందీ సినిమాకి సాధ్యం కాని విధంగా ఈ చిత్రం అక్కడ భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. బాలీవుడ్‌ సెలబ్రిటీలు సైతం ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇప్పటికే సౌత్‌లో `పుష్ప` ఓటీటీలో విడుదలైంది. జనవరి 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల చేశారు. హిందీలో థియేటర్‌ కలెక్షన్లు భారీగా ఉండటంతో అక్కడ మాత్రం ఓటీటీ రిలీజ్‌ చేయలేదు. 

తాజాగా హిందీ వెర్షన్‌ `పుష్ప`ని విడుదల చేయబోతున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయబోతున్నట్టు అమెజాన్‌ ప్రైమ్‌ వెల్లడించింది. జనవరి 14న శుక్రవారం ఈ చిత్రం హిందీ వెర్షన్‌ స్ట్రీమింగ్‌ కాబోతుంది. సినిమా అన్ని భాషల్లో ఓటీటీ సుమారు రూ.85కోట్లకు అమ్ముడు పోయిందని టాక్‌. అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన `పుష్ప` చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. సమంత స్పెషల్‌ సాంగ్‌ చేసిన ఈ చిత్రం డిసెంబర్‌ 17న విడుదలైంది. 

Scroll to load tweet…