Asianet News TeluguAsianet News Telugu

‘పుష్ప’ :తమిళ,మళయాళ,కన్నడ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరో తెలిస్తే మతిపోతుంది !

కరోనా పాండమిక్ తర్వాత టాలీవుడ్ నుండి తెలుగు హిందీ తమిళం కన్నడ మలయాళం సహా ఒకేసారి ఐదు భాషల్లో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న మొదటి చిత్రంగా ''పుష్ప: ది రైజ్'' నిలవనుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రాన్ని ఆయా భాషాల్లో రిలీజ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ ఎవరో చూద్దాం.

Pushpa got very strong distributors in all four languages
Author
Hyderabad, First Published Nov 21, 2021, 1:05 PM IST


ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప”. 2021 డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ మేరకు రిలీజ్ సన్నాహాల్లో మేకర్స్ బిజీగా ఉన్నారు. కరోనా పాండమిక్ తర్వాత టాలీవుడ్ నుండి తెలుగు హిందీ తమిళం కన్నడ మలయాళం సహా ఒకేసారి ఐదు భాషల్లో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న మొదటి చిత్రంగా ''పుష్ప: ది రైజ్'' నిలవనుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రాన్ని ఆయా భాషాల్లో రిలీజ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ ఎవరో చూద్దాం.

పుష్ప హిందీ వెర్షన్ రైట్స్ ని  AA Films, తమిళ రైట్స్ ని  Lyca ప్రొడక్షన్స్, మళయాళం రైట్స్ ని E4 ఎంటర్టైన్మెంట్ వారు,కన్నడ రైట్స్ ని Swagath Enterprises వారు భారీ రేట్లు ఇచ్చి తీసుకున్నారు. ఇక అనీల్ తడానికి చెందిన  AA films విషయానికి వస్తే వారు ఇంతకు ముందు రాజమౌళి బాహుబలి చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసారు. లైకా ప్రొడక్షన్స్ గురించి చెప్పేదేముంది. రజనీకాంతో తో  2.0 ని ప్రొడ్యూస్ చేసారు. కన్నడ రైట్స్ తీసుకున్న స్వాగత్ వారు కూడా భారీ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయగా, మళయాళ రైట్స్ తీసుకున్న  E4 ఎంటర్టైన్మెంట్  గతంలో అల్లు అర్జున్ చిత్రాలను,మరెన్నో తెలుగు సినిమాలను రిలీజ్ చేసింది. ఇలా ఆయా భాషల్లో స్ట్రాంగ్ గా ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ని ఎంపిక చేసుకుని పుష్ప ముందుకు వెళ్తోంది.
 
మరో ప్రక్క హిందీ విడుదల విషయంలో ప్రొడక్షన్ హౌస్,  గోల్డ్‌మైన్ టెలీఫిల్మ్స్  ఓనర్ మధ్య తలెత్తిన సమస్యను పరిష్కరించడంలో అల్లు అర్జున్ కీలకపాత్రను పోషించినట్లు సమాచారం.  అల్లు అర్జున్ చొరవ తీసుకుని యూట్యూబ్ రైట్స్ తీసుకున్న వారితో స్వయంగా చర్చించి విజయం సాధించారు. దాంతో ఇప్పుడు  “పుష్ప” వెర్షన్ రిలీజ్ కు మార్గం సుగమమైంది. 
Also read Pushpa: 'ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా' సాంగ్ వచ్చేసింది.. తన సైన్యంతో అల్లు అర్జున్ చిందులు

కాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా బన్నీ కనిపించనున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. సునీల్ - అనసూయ - ధనుంజయ ఇతర కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Also read Mahesh babu: కథా లేదు, జోనర్ తెలియదు.. విలన్ పేరు సోమలింగం
 

Follow Us:
Download App:
  • android
  • ios