Asianet News TeluguAsianet News Telugu

‘పుష్ప’ షూటింగ్ పై బన్ని షాకింగ్ డెసిషన్

రకరకాలుగా ఆలోచించి అల్లు అర్జున్ ఓ నిర్ణయం తీసుకున్నారు. బయిట ఉన్న పరిస్దితులకు భయపడుతూ షూటింగ్ చేసుకునేకన్నా..అన్నపూర్ణ స్టూడియోలో ఫారెస్ట్ సెట్ నిర్మించుకుంటే ఏ ఇబ్బందులు లేవని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు నిర్మాతలను ఒప్పించి ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఫారెస్ట్ సెట్ అంటే మాటలు కాదని, చాలా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.  ఇక ఈ సినిమా వంద శాతం మేకిన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందబోతోంది. మన దేశంలోని సినీ కార్మికులకి, సాంకేతిక నిపుణులకి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా వందశాతం స్థానికంగానే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని చెప్తున్నారు. 

Pushpa Forest set to be erected in Annapurna!
Author
Hyderabad, First Published Jun 16, 2020, 10:06 AM IST

స్టార్ హీరోల సినిమాలు అనగానే... అందులో ఏదో ఒక సీన్ కోసం విదేశాలకి వెళ్లడమో, లేదంటే విదేశీ సాంకేతిక నిపుణుల సాయం తీసుకోవడమో జరగుతూంటుంది! పాటకో, ఫైటుకో, కొన్నిసార్లు కథానుసారం, కొన్ని సార్లు హంగామానుసారం విదేశాలలో షూటింగ్‌ చేస్తారు. కథా వస్తువులాగో, బ్యాక్‌ డ్రాప్‌ లాగానో, లేదంటే హంగామా కోసమో ‘విదేశాలు – విదేశీ లొకేషన్లు’’ మన సినిమాకి ఎప్పుడూ ఉపయోగపడుతున్నాయి. ఈ మధ్యకాలంలో  మన సినిమాల్లో విదేశీ హంగులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే కరోనా విజృంభిస్తున్న పరిస్దితుల్లో గతంలోలాగ కుదరదు. అన్ని మేడిన్ ప్రాజెక్టులే. ఇక్కడే సెట్స్ వేసి లాగించేస్తున్నారు. అల్లు అర్జున్‌ తాజా చిత్రం ‘పుష్ప’ సైతం అదే పరిస్దితిని ఎదుర్కొంటోంది. ఈ సినిమా నిమిత్తం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఫారెస్ట్ సెట్ వేస్తున్నారు.

ఈ సినిమా లాంచ్ అయిన నాటి నుంచీ నిర్మాతలు లొకేషన్స్ విషయంలో చాలా కన్ఫూజ్ గా ఉన్నారు. మొదట ఈ చిత్రం షూటింగ్ ని కేరళలో జనవరిలో మొదలెట్టారు. డైరక్టర్ సుకుమార్ కీ క్యారక్టర్స్, జూనియర్స్ మీద కొన్ని సీక్వెన్స్ లు షూట్ చేసారు. మార్చి దాకా లెంగ్తీ షెడ్యూల్ ప్లాన్ చేసారు. అయితే ఈ లోగా లాక్ డౌన్ వచ్చేసింది. దాంతో షెడ్యూల్స్ కాన్సిల్ చేసారు. కేరళలో కరోనా అప్పుడు ఎక్కువ ఉండటంతో వెనక్కి వచ్చేసారు. ఆ తర్వాత తూర్పు గోదావరి మారేడిపల్లి అడవుల్లో ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం కూడా మార్చుకున్నారు.

రకరకాలుగా ఆలోచించి అల్లు అర్జున్ ఓ నిర్ణయం తీసుకున్నారు. బయిట ఉన్న పరిస్దితులకు భయపడుతూ షూటింగ్ చేసుకునేకన్నా..అన్నపూర్ణ స్టూడియోలో ఫారెస్ట్ సెట్ నిర్మించుకుంటే ఏ ఇబ్బందులు లేవని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు నిర్మాతలను ఒప్పించి ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఫారెస్ట్ సెట్ అంటే మాటలు కాదని, చాలా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.  ఇక ఈ సినిమా వంద శాతం మేకిన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందబోతోంది. మన దేశంలోని సినీ కార్మికులకి, సాంకేతిక నిపుణులకి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా వందశాతం స్థానికంగానే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని చెప్తున్నారు. 

పాన్‌ ఇండియా స్థాయిలో, ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రమిది. సుకుమార్‌ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. రష్మిక నాయిక. లాక్‌డౌన్‌ తర్వాత ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఇందులో  హీరో పాత్ర పరిచయం నేపథ్యంలో ఆరు నిమిషాలపాటు సాగే యాక్షన్‌ ఘట్టం ఉంటుందట. ఆ సన్నివేశాల్ని    రూ.6 కోట్ల వ్యయంతో చిత్రీకరిస్తారు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో, అల్లు అర్జున్‌..పుష్పరాజ్‌ అనే పాత్రలో కనిపిస్తారు.
  
 ఈ విషయం గురించి ‘పుష్ప’ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్‌ మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం కరోనా వల్ల కావాలనుకున్న చోట షూటింగ్‌ చేయాలనుకోవడం కచ్చితంగా కుదరదు.అడవి ప్రాంతాల్లో షూటింగ్‌ ఎక్కువ శాతం ఉంది. చిత్తూరు, వికారాబాద్‌ అడవుల్లో షూట్‌ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ అన్నీ కుదిరితే కేరళలో కొంత భాగం షూట్‌ చేస్తాం. మా బ్యానర్‌ లో మిగతా సినిమాల్లో ఏదైనా ఫారిన్‌ లో ఉంటే తర్వాత ఆలోచిస్తాం. సినిమా అంటేనే క్రియేషన్‌. క్రియేటివ్‌ వర్క్‌ని ఇక్కడే చేయాలి.. అక్కడే చేయాలని రూల్స్  పెట్టుకోలేం.అలాగని అన్ని సినిమాలూ ఇండియాలోనే చేస్తామా? అంటే ఇప్పుడే ఏం చెప్పలేం’’ అని పేర్కొన్నారు.
 
‘అల వైకుంఠపురములో..’ సినిమా తర్వాత అల్లు అర్జున్‌ నటిస్తున్న సినిమా ఇది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక హీరోయిన్. ప్రకాశ్‌రాజ్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, వెన్నెల కిశోర్‌, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా   నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్ర‌సాద్ ‌స‌ంగీతం అందిస్తున్నాడు.  తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదల కానుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios