Asianet News TeluguAsianet News Telugu

‘పుష్ప’ సీన్ లీక్,కంప్లైంట్..లీక్ సీన్ లో ఏముంది?

 రెండు సినిమాలను నిర్మిస్తున్న ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ విషయంపై పోలీసు ఫిర్యాదు చేశారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా లీకు వీరుళ్లను హెచ్చరించారు. 

Pushpa fight scene leak: producers take action
Author
Hyderabad, First Published Aug 16, 2021, 5:40 PM IST

చాలా కాలంగా పెద్ద సినిమాలకు లీకులు సమస్య వేధిస్తోంది. ముఖ్యంగా తమిళ, తెలుగు స్టార్ హీరోల సినిమాలకు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. కొన్ని సార్లు పాటలు, ఫైట్ సీన్స్ లీక్ అయ్యి నెట్ లో ప్రత్యక్ష్యమైపోతున్నాయి. కొన్ని సార్లు రిలీజ్ కు ముందు సినిమా లో చాలా భాగం రిలీజ్ అవటం కూడా జరుగుతోంది. అతెందుకు  రీసెంట్ గా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘సర్కారువారి పాట’ టీజర్ ముందే నెట్ లోకి వచ్చేసింది. అలాగే  ‘పుష్ప’ చిత్రంలోని ‘దాక్కో దాక్కో మేక’ పాటది అదే పరిస్దితి. ఆ  పాట సైతం  సోషల్‌ మీడియాలో ముందే కనపడింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం...ఈ రెండు మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ నుండి వ‌స్తున్న సినిమాలే కావ‌డం.

దీంతో రెండు సినిమాలను నిర్మిస్తున్న ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ విషయంపై పోలీసు ఫిర్యాదు చేశారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా లీకు వీరుళ్లను హెచ్చరించారు. ఆ కాసేపటికే “పుష్ప”లో దాదాపు 20 సెకన్ల ఫైటింగ్ సీక్వెన్స్ ను లీక్ చేసి షాకిచ్చారు. ఈ లీకైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక పుష్ప నుంచి 20 సెక‌న్ల వీడియో లీక్ కాగా, ఇందులో అల్లు అర్జున్, ర‌ష్మిక క‌నిపిస్తున్నారు. బ‌న్నీ మెట‌ల్ కుర్చీతో గూండాని కొడుతున్నట్టుగా ఉంద‌ని అంటున్నారు‌. ఈ ఫైట్ సీన్‌కి సంబంధించిన స‌ీన్ ఎడిటింగ్ టేబుల్ నుండే బయిటకు వచ్చే అవకాసం ఉందని చెప్పుకుంటున్నారు. మైత్రి మూవీ మేక‌ర్స్‌ వారు ఈ విషయమై సైబ‌ర్ క్రైమ్‌ని సంప్ర‌దించారు.

ఆన్ లైన్ లో లీక్ కావడం పట్ల మైతీ మూవీ మేకర్స్ తీవ్రంగా స్పందించిన మైత్రి సంస్థ‌.. మా చిత్రాలకు సంబంధించిన కంటెంట్ ఆన్ లైన్ లో లీక్ కావడం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చేశాం అని  చెప్పారు. ఈ తరహా ధోరణితో తమను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, ప్రేక్షకులకు అందాల్సిన థ్రిల్ ను చంపేస్తున్నారని వివరించింది. దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని మైత్రీ మూవీ మేకర్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇలాంటి త‌ప్పుడు ప‌నులు చేసే వారిని ఎట్టి ప‌రిస్థితుల‌లో వ‌దిలి పెట్ట‌బోమ‌ని పేర్కొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios