‘పుష్ప’ ఫేమ్ జగదీశ్ అలియాస్ ప్రతాప్ ను ఇటీవల పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా జగదీశ్ తన నేరాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. విచారణలో పలు విషయాలను వెల్లడించారని తెలుస్తోంది. 

‘పుష్ప’లో అల్లు అర్జున్ కి అసిస్టెంట్ గా కేశవ పాత్రలో నటించిన జగదీశ్ (Jagadeesh) ఎంత పాపులర్ అయ్యారో తెలిసిందే. కెరీర్ సాఫీగా సాగుతున్న క్రమంలో జగదీష్ పై ఊహించని కేసు నమోదైంది. వారంపది రోజుల కింద పంజాగుట్ట పోలీసులు కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో జగదీశ్ తన నేరాన్ని ఒప్పుకున్నాడని తెలుస్తోంది. పోలీసులకు జరిగిన విషయాన్ని చెప్పాడనేది బ్రేకింగ్ న్యూస్.... 

విచారణలో.. మరోకరితో తన ప్రేమికురాలు సన్నిహితంగా ఉండటంతో ఆ ఫొటోలను తీసి బెదిరించినట్టు ఒప్పుకున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేస్తానని కూడా భయబ్రాంతులకు గురి చేశాడని పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. ఆమె మరో యువకుడికి దగ్గరవడంతోనే తట్టుకోలేక అలా చేసినట్టు చెప్పారని తెలుస్తోంది. మొత్తంగా తన నేరాన్ని ఒప్పుకోవడంతో దర్యాప్తు ముందుకు సాగుతోంది. 

తన ప్రియులురాలు మరోకరితో సన్నిహితంగా ఉండటంతో అది భరించలేకపోయాడు. వాళ్లిద్దిరూ సన్నిహితంగా ఉన్న వీడియోను, ఫోటొలను తీశాడు. ఆ ఫొటోలను నెట్టింట పెడ్తానని చెప్పడంతో గతనెల 29న యువతీ సూసైడ్ చేసుకుంది. యువతీ తండ్రి ఫిర్యాదు తో ఈ నెల 6న పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీ ముగియడంతో చెంచలగూడ జైల్ కు తరలించారు. 

ఇక కోర్టు అనుమతితో పంజాగుట్ట పోలీసులు జగదీశ్ ను విచారించారు. ఈ క్రమంలో తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఆ యువతీ మరొకరితో సన్నిహితంగా ఉండటమే ప్రధాన కారణంగా చెప్పినట్టు తెలుస్తోంది. ‘పుష్ప’తో వచ్చిన ఫేమ్ ద్వారా జగదీశ్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని.. ఆ యువతీ అందుకే దూరమైందని కూడా తెలుస్తోంది. తన తప్పు తెలుసుకున్న జగదీశ్ మళ్లీ తన దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో యువతీ ఆత్మహత్య చేసుకుంది. ఇక జగదీశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అటు ‘పుష్ప2’ మూవీ షూటింగ్ కూడా ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది.