అడ్వాన్స్ బుకింగ్స్ లో `పుష్ప 2` సినిమా దుమ్ములేపుతుంది. ఇప్పటి వరకు 3మిలియన్స్ టికెట్స్ సేల్ అయ్యింది. ఇదొక కొత్త రికార్డుగా చెప్పొచ్చు. అయితే దీనికంటే ముందు బాహుబలి2 3.3 మిలియన్స్ తో ముందు ఉంది. మిగిలిన అన్ని సినిమాల రికార్డులను పుష్ప 2 బ్రేక్ చేసిందని చెప్పొచ్చు.
పుష్ప 2 ఫస్ట్ డే ఫస్ట్ షో : లైవ్ అప్డేట్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు పడిపోగా బొమ్మ అదుర్స్ అంటూ అల్లు ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. అదిరిపోయే యాక్షన్, డ్రామా, ఫ్యామిలి సెంటిమెంట్ తో సిసిమా ఆకట్టుకుంది. అభిమానుల మాటలు చూస్తుంటే పుష్ప మాదిరిగానే పుష్ప 2 కూడా వరల్డ్ వైడ్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
అడ్వాన్స్ బుకింగ్స్ లో `పుష్ప 2` ర్యాంపేజ్.. 3 మిలియన్స్ టికెట్స్
చిరంజీవి, పవన్‌లపై `పుష్ప 2`లో డైలాగ్.. నిజం ఏంటంటే
`పుష్ప 2` సినిమాలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరన్‌లపై అల్లు అర్జున్ డైలాగ్ ఉంటుందని, ఎవర్రా బాస్, వాడికి, వాడి కొడుక్కి, వాడి తమ్ముడికి నేనే బాస్ అనేలా ఆ డైలాగ్ ఉందంటూ ట్రోల్స్ నడుస్తున్నాయి. అయితే అందులో నిజం లేదు. అది ఫేక్ ప్రచారం. “ఎవడ్రా బాస్? ఎవడికిరా బాస్? మాములుగా చూస్తేనే బాస్ కనిపిస్తాడు. ఇలా తల్లకిందులుగా చూస్తేనే బాస్ లకే బాస్ కనిపిస్తాడు. నేనేరా నీ బాస్. పుష్పాయే బాస్. భూగోళంలో యాడున్నా సరే… నీ యెవ్వా తగ్గేదేలే” అంటాడు. ఇది కొందరు కావాలని క్రియేట్ చేసిందిగా గమనించాలి.
సంధ్య థియేటర్ విషాదంపై స్పందించిన `పుష్ప 2` టీమ్
సంధ్య థియేటర్లో రాత్రి నెలకొన్న తొక్కీసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. బాలుడు ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పుష్ప 2 స్పందించింది. బాధితులకు అండగా నిలుస్తామని తెలిపింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది.
అల్లు అర్జున్ అత్యుత్సాహం.. పెద్ద విషాదం
అల్లు అర్జున్ రాత్రి ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూశారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో ఆయన అభిమానులతో కలిసి సినిమా చూశాను. అయితే ఆయన్ని చూసేందుకు భారీగా ఫ్యాన్స్ తరలి వచ్చారు. దీంతో తొక్కీసలాట జరిగింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. బన్నీ ఫ్యాన్స్ కోసం చేసిన హడావుడి ఇప్పుడు ఆయనకే చుట్టుకుంది. అది విషాదానికి దారి తీసింది. దీనితోడు సరైన పోలీసు భద్రత లేకపోవడంతో థియేటర్ వద్ద పరిస్థితి అదుపు తప్పింది. దీంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ బాలుడు కూడా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది.
పుష్ప 2` థియేటర్ వద్ద మహిళ మృతి
పుష్ప 2 సినిమా హంగామాలో విషాదం చోటు చేసుకుంది. సంధ్య థియేటర్‌కి ఫ్యాన్స్ భారీగా పోటెత్తారు. దీంతో తొక్కీసలాట జరిగింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందారు. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. మరికొందరికి గాయాలు అయినట్టు తెలుస్తుంది.
కథ ఏంటి
పుష్పరాజ్(అల్లు అర్జున్) తన ఎర్రచందనంతో జపాన్‌కి వెళ్తాడు. జపాన్ పోర్ట్ లో అక్కడి మాఫియాతో ఫైట్ చేస్తాడు. కట్ చేస్తే చిత్తూరు శేషాచలం అడవుల్లో పుష్పరాజ్ ఎర్ర చందనం స్మగ్లింగ్‌తో అడ్డులేకుండా ఎదుగుతాడు. సిండికేట్ మొత్తం తన కంట్రోల్‌లోకి వస్తుంది. మరోవైపు పుష్పని అడ్డుకోవాలని ఎస్పీ భన్వర్ సింగ్ షేకావత్(పహద్ ఫాజిల్) ప్లాన్ చేస్తున్నాడు. ఓ కూలి వాడిగా అడవుల్లోకి వెళ్లి అందరిని అరెస్ట్ చేస్తాడు. చితక్కొడతాడు. తన మనషులను విడిపించడానికి వచ్చిన పుష్పతో పోలీసులు అతి చేయడంతో అందరు పోలీసులను కొనేస్తాడు. పోలీస్ స్టేషన్ మొత్తం ఖాళీ. దీంతో రెచ్చిపోయిన షేకావత్ ఒక సిండికేట్‌ని చంపేస్తాడు. దీంతో మిగిలిన సిండికేట్లు అంతా భయపడతారు.
పాజిటివ్ రిపోర్ట్స్
పుష్ప 2 చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుంచే వరల్డ్ వైడ్ గా ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ఆల్రెడీ రివ్యూలు, పబ్లిక్ టాక్ బయటకి వచ్చేసింది. బిజినెస్ కూడా భారీ స్థాయిలో అయ్యింది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ దుమ్మురేపింది. మరి ఇంతటి భారీ స్థాయిలో వస్తున్న ఈ సినిమా ఎలా ఉందనేది వివరంగా ఈ లైవ్ రివ్యూలో తెలుసుకుందాం.
మూవీ కంప్లీట్
ఫ్యామిలీ సెంటిమెంట్ సన్నివేశాలతో సినిమా ముగుస్తుంది.
కళ్ళు చెదిరే యాక్షన్ ఎపిసోడ్
ప్రస్తుతం మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సన్నివేశం వస్తోంది. అల్లు అర్జున్ కంప్లీట్ గా మాన్స్టర్ తరహాలో శత్రువులపై విరుచుపడుతున్నారు. ఊహకి అందని విధంగా ఈ యాక్షన్ సన్నివేశం రూపొందించారు.
పుష్పని చుట్టుముట్టిన సమస్యలు
పుష్పకి సమస్యలు మొదలవుతాయి. కుటుంబంలో ఒకరు కిడ్నాప్ అవుతారు. ఊహించని సమస్యలు చుట్టుముట్టడంతో పుష్ప బాగా డౌన్ అవుతాడు. సన్నివేశాలు తీవ్ర ఉత్కంఠగా మారుతాయి.
కిస్సిక్ సాంగ్ లో శ్రీలీల మెరుపులు
పుష్ప ఏకంగా సీఎంని మార్చేశాడు. ఆ తర్వాత శ్రీలీల కిస్సిక్ సాంగ్ వస్తుంది. అల్లు అర్జున్, శ్రీలీల ఇద్దరూ డ్యాన్స్ తో అదరగొట్టారు.
రష్మిక ఎమోషనల్ పెర్ఫామెన్స్
జాతర సన్నివేశంలోనే సూసేకి అగ్గిరవ్వ అనే సాంగ్ కూడా ఉంటుంది. సాంగ్ తర్వాత ఫ్యామిలీ సన్నివేశాలు వస్తాయి. ఈ సన్నివేశాల్లో రష్మిక తన ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో కట్టిపడేసింది.
జాతరలో అమ్మోరుగా పుష్ప
జాతర సన్నివేశంలో సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ లో పుష్ప అమ్మోరు గెటప్ లో ఉంటాడు. థియేటర్లు దద్దరిల్లేలా సుకుమార్ ఈ ఎపిసోడ్ ని రూపొందించారు. సాంగ్ లోనే పుష్ప , రష్మిక మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఉంటాయి.
షెకావత్ కి పుష్ప ఛాలెంజ్ - ఫస్టాఫ్ కంప్లీట్
టెన్షన్ నెలకొలిపే సన్నివేశాలతో డ్రామా మరింత రసవత్తరంగా మారింది. భన్వర్ సింగ్ షెకావత్, పుష్ప మధ్య ఛాలెంజ్ విసురుకునే సన్నివేశాలతో ఇంటర్వెల్ పడింది.
సిండికేట్ పార్టీ
అనసూయ, సునీల్ ఆసక్తికరంగా ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత ఎర్ర చందనం సిండికేట్ గ్యాంగ్ మొత్తం పార్టీ ఏర్పాటు చేస్తారు. షెకావత్, పుష్ప మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు జరుగుతాయి. ఉత్కంఠ నడుమ ఈ సన్నివేశం మంచి హై ఇచ్చే విధంగా ఉంటుంది.
ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా పుష్ప
మాల్దీవుల్లో వచ్చే సన్నివేశాలు ఉత్కంఠ భరితంగా ఉంటాయి. ఈ సన్నివేశాల్లో వచ్చే ట్విస్ట్ హైలైట్ గా నిలిచింది. పుష్ప ఒక్కసారిగా ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా మారిపోయాడు. ఈ సన్నివేశం తర్వాత సెకండ్ సాంగ్ మొదలయింది. రష్మిక, అల్లు అర్జున్ డ్యాన్స్ నంబర్ ఫీలింగ్స్ అనే సాంగ్ ఇది. బన్నీ, రష్మిక డ్యాన్స్ ఫ్యాన్స్ ని హుషారెత్తించేలా ఉంది.
పుష్పకి అవమానం
సీఎం, పుష్ప మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పుష్పకి ఊహించని విధంగా అవమానం ఎదురవుతుంది. తిరిగి పుష్ప ఇచ్చే కౌంటర్ అదిరిపోయింది.
పుష్ప, శ్రీవల్లి రొమాన్స్
అల్లు అర్జున్, రష్మిక మధ్య రొమాంటిక్ కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి. బన్నీ కామెడీ టైమింగ్ బావుంది.
పోలీస్ స్టేషన్ లో పుష్ప హంగామా
పోలీస్ స్టేషన్ లో పుష్ప రాజ్ హంగామా సృష్టించే సన్నివేశం సూపర్బ్ గా కుదిరింది. ఇక్కడే పుష్ప.. షెకావత్ కి ఝలక్ ఇస్తాడు. ఈ సన్నివేశం చిన్న ట్విస్ట్ తో ఉంటుంది. అనంతరం ఫస్ట్ సాంగ్ వస్తుంది.
ఫాహద్ ఫాజిల్ ఎంట్రీ
అల్లు అర్జున్ చిన్ననాటి సన్నివేశాలు చూపిస్తున్నారు. ఎమోషనల్ గా ఉన్నాయి. ఆ తర్వాత భన్వర్ సింగ్ షెకావత్ గా ఫాహద్ ఫాజిల్ సింపుల్ ఎంట్రీ ఇచ్చాడు. అదే విధంగా రష్మిక కూడా ఎంట్రీ ఇచ్చింది. గుడిలో ఆమెని అవమానించే సన్నివేశాలు వస్తున్నాయి.