అల్లు అర్జున్ హీరోగా నటించిన `పుష్ప 2` కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ మూవీ వెయ్యి కోట్ల చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గట్టి దెబ్బ పడింది.
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన `పుష్ప 2` సినిమా బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తుంది.ఈ మూవీ భారీ కలెక్షన్ల దిశగా వెళ్తుంది. వెయ్య కోట్లకు దగ్గరలో ఉంది. ఈ క్రమంలో సినిమాకి పెద్ద దెబ్బ పడింది. అనూహ్యంగా సినిమా లీక్ అయ్యింది. సోషల్ మీడియాలో హెచ్‌డీ ప్రింట్ కనిపించడం విశేషం. ఇది వైరల్‌గా మారింది. ఇది సినిమాకి గట్టి దెబ్బ అనే చెప్పాలి.
`పుష్ప 2` సినిమా గత గురువారం విడుదలైన విషయం తెలిసిందే. నేటితో మొదటి వారం పూర్తి చేసుకుంటుంది. వారం రోజుల్లోనే ఈ మూవీ వెయ్యి కోట్లు వసూలు చేయడం విశేషం. సినిమాకి నార్త్ ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా భారీ కలెక్షన్ల దిశగా వెళ్తుంది. లాంగ్ రన్‌లో ఇది 1300-1500కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు ట్రేడ్ పండితులు. కానీ ఇప్పుడు అనూహ్యంగా సినిమా కి పెద్ద షాక్ తగిలింది.
హిందీ వెర్షన్ మూవీ ఆన్ లైన్‌లో దర్శనమిచ్చింది. యూట్యూబ్‌లో లీక్ అయ్యింది. 'గోట్స్స్' అనే యూట్యూబ్ ఖాతాలో సినిమా థియేటర్ ప్రింట్ అప్‌లోడ్ చేయడం షాకిస్తుంది. కోవిడ్ తర్వాత హిందీలోకి డబ్ అయిన దక్షిణాది చిత్రాలలో అత్యధిక వసూళ్లు సాధిస్తున్న చిత్రం పుష్ప 2. `జవాన్` వంటి హిందీ చిత్రాల వసూళ్ల రికార్డులను కూడా `పుష్ప 2` బద్దలు కొడుతుందని అంంచనా.
సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ వరుసగా పుష్ప రాజ్, శ్రీవల్లి, భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలు పోషించారు. పుష్పరాజ్‌గా బన్నీ నెక్ట్స్ లెవల్ యాక్టింగ్ చూపించారు.
ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 922 కోట్ల రూపాయలను ఈ చిత్రం వసూలు చేసింది. బాలీవుడ్‌లో హిందీ చిత్రాలను సైతం అధిగమించే ప్రదర్శనను అల్లు అర్జున్ చిత్రం కనబరుస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ ట్రాకర్ sacnilk.com లెక్కల ప్రకారం, భారతదేశంలోనే పుష్ప 400 కోట్లకుపైగా నెట్ సాధించింది.
ప్రివ్యూ కలెక్షన్ 10.65 కోట్లతో పాటు, మొదటి రోజు 164 కోట్లు, రెండో రోజు 93 కోట్లు, మూడో రోజు 119 కోట్లు, నాలుగో రోజు 141 కోట్లు వసూలు చేసింది. ఐదో రోజు భారతదేశంలో 64.45 కోట్లు వసూలు చేసింది. మంగళవారం కలెక్షన్లతో ఈ మూవీ వెయ్యి కోట్లకు దగ్గరలో ఉంది. బుధవారంతో వెయ్యి కోట్లు ఈజీగా దాటేస్తుంది.
హిందీలో ఈ మూవీ భారీ వసూళ్లని రాబడుతుంది. ఇప్పటికే ఇది రూ.375కోట్ల గ్రాస్ వచ్చింది. సుమారు 200కోట్లకుపైగా షేర్ సాధించిందీ మూవీ. తెలుగులో 70కోట్ల షేర్ వచ్చింది. ఏపీలో భారీ వందకోట్లకు దగ్గరలో ఉంది. ఇలా భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ మూవీకి ఇప్పుడు ఈ లీకేజీ పెద్ద దెబ్బగా మారనుందని చెప్పొచ్చు. మరి దీనిపై టీమ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
