పూరితో రామ్ సినిమా ఓకే అనగానే ఈ ప్రాజెక్టులో ఛార్మి ఉంటుందని అందరికీ అర్దమైపోయింది. అయితే ఛార్మి కొంత వరకే ఇన్వాల్వ్ అవుతుందని భావించారు. అయితే ఛార్మి ..ప్రతీ విషయంలోనూ తనే ఫైనల్ అన్నట్లుగా ప్రాజెక్టులో లీనమైపోయిందిట.  ఆమె ప్రొడక్షన్ వర్క్, పబ్లిసిటీ రిలేటెడ్ యాక్టివిటీస్ , రిలీజ్ ప్లాన్స్ , మిగతా స్టఫ్ అంతా ప్లాన్ చేస్తోందిట. పూరి జగన్నాథ్ మొత్తం ఆమెకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం జరిగిందిట. ఈ విషయమై రామ్ నిమిత్త మాత్రుడుగా కేవలం హీరోగానే షూటింగ్ వెళ్లి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. 

కొన్ని విషయాలు పూరి జగన్నాథ్ ని అడగగలం. కానీ ఛార్మి అనేసరికి కష్టమపోతుంది. ముఖ్యంగా డబ్బులు విషయాల్లో ఆమె చాలా ఖచ్చితంగా ఉంటోందిట. అది కొంతమంది టెక్నీషియన్స్ కు నచ్చటం లేదట. పూరి తాను కేవలం క్రియేటివ్ సైడ్ మాత్రం చూసుకోగలను,వాటిల్లో ఏదన్నా డౌట్స్ ఉంటే అడగండి. అంతేగానీ ప్రొడక్షన్ సైడ్ అంటే ఆమెనే డీల్ చేయండని చెప్పాసాడట. దాంతో ఎవరూ ఏమీ మాట్లాడటం లేదుట. 

ఇక  సినిమాకు సినిమాకు మధ్య ఎప్పుడూ నెలకంటే ఎక్కువగా గ్యాప్ తీసుకొని పూరిజగన్నాథ్  మొదటి సారి చాలా గ్యాప్ తీసుకొని ఈ  సినిమాను ప్రకటించాడు. ఎప్పటినుంచో  ఎనర్జిటిక్ హీరో రామ్ తో చేయాలనుకున్నాడు కానీ ఇన్నాళ్లకు కుదిరింది. ఓ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఓ కొత్త పాయింట్ ని డీల్ చేస్తారట. 

అలాగే  తన సినిమాల్లో హీరోలను డిఫరెంట్ గా ప్రెజెంట్ చెయ్యడంలో పూరి జగన్నాధ్ పండిపోయారు. ముఖ్యంగా పూరి హీరోలకు ఇచ్చే మేకోవర్ ను చూసి ఆడియన్స్ థ్రిల్ అవుతూంటారు. ఇప్పుడు రామ్ ను కూడా అలాగే లుక్స్ తో పాటు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో ప్రెజెంట్ చేసే పనిలో ఉన్నాడట.  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో స్టార్ట్ చేస్తారని సమాచారం.