సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకుడు పూరి జగన్నాథ్ గతంలో 'పోకిరి','బిజినెస్ మెన్' సినిమాలు తీశాడు. ఆ రెండూ మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే మహేష్ తో మరో సినిమా చేయాలనుకున్నాడు పూరి.

దానికి 'జనగణమన' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు. మహేష్ తో సినిమా ఉంటుందని అనౌన్స్ కూడా చేశాడు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా ఊసే లేకుండా పోయింది. పూరి మాత్రం ఎప్పటికైనా ఈ సినిమా చేస్తానని అంటున్నాడు.

సినిమా టైటిల్ ని బట్టి దేశభక్తి కథ అని తెలుస్తోంది. ప్రస్తుతం భరత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపధ్యంలో ఈ సినిమాను మరోసారి గుర్తుచేసుకున్నాడు పూరి. 'జనగణమన' సినిమా నుండి పూరి ఒక డైలాగ్ ని తాజాగా తన ట్విట్టర్ లో షేర్ చేశాడు.

''డచ్ ,ఫ్రెంఛ్ , బ్రిటిష్ .. ఎప్పుడూ ఎవడెవడో ఆక్రమించుకోవడమేనా ? ఆ పని మనమెందుకు చేయడం లేదు ? ఎప్పుడు ఈ ఇండియన్స్ మీద పడిపోతారో అని మిగతా దేశాలు భయపడుతూ చావాలి.. STRENGTH LIES IN ATTACK, NOT IN DEFENCE''.. ఈ డైలాగ్ ని చూసిన నెటిజన్లు పూరి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మహేష్ తో తొందరగా సినిమా చేయండి సార్ అంటూ పూరిని కోరుతున్నారు.