Asianet News TeluguAsianet News Telugu

ఏకాంతానికి, ఒంటరితనానికి తేడా అదే.. పూరీ పలుకులు

జీవితంలో ఒకటి రెండు సార్లు పూరీ కూడా ఒంటరి తనం ఫేస్‌ చేశాడట. ఒంటరితనం నుంచి బయటపడటం రాకపోతే అందులోనే  కూరుకుపోతామని, ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్‌ అయినప్పుడు మాత్రం ఒంటరిగా ఉండొద్దని, ఫ్రెండ్స్ తో గడపండని తెలిపారు. అంతేకాదు ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్‌ వినాలని, వర్కౌట్‌ చేయాలన్నారు. 

puri jagannath said in his musicings loneliness and eloneness
Author
Hyderabad, First Published Aug 19, 2020, 11:27 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ ఇటీవల కరోనా సమయంలో ఆడియెన్స్ ని తనదైన స్టయిల్‌లో ఎంటర్‌టైనర్‌ చేస్తున్నారు. సినిమా షూటింగ్‌లు పున ప్రారంభానికి ఇంకాస్త టైమ్‌ పడుతున్న నేపథ్యంలో మరో రూపంలో అభిమానులను అలరింప చేయాలని పూరీ నిర్ణయించుకున్నారు. 

ఇటీవల `పూరీ మ్యూజింగ్స్` పేరుతో ఓ బ్లాగ్‌ను ప్రారంభించారు. ఇందులో తన ఆలోచనలను పంచుకుంటున్నారు. రోజుకో కొత్త విషయాన్ని చెబుతూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల సెక్స్ గురించి బోల్డ్ కామెంట్‌ చేసి సోషల్‌ మీడియాని ఊపేసిన పూరీ తాజాగా బూస్టింగ్‌ డోస్‌లో భాగంగా ఒంటరి తనం, ఏకాంతం గురించి మోటివేట్‌ చేశారు. 
ఆయన చెబుతూ, ఒంటరి తనానికి, ఏకాంతానికి చాలా తేడా ఉందన్నారు. ఒంటరితనం ఎప్పుడు ఫీల్‌ అవకూడదని, అలా ఫీల్‌ అయితే నీరసం వస్తుందని, ఏడుపొస్తుందన్నారు. మన మీద మనకే నమ్మకం పోతుందన్నారు. 

జీవితంలో ఒకటి రెండు సార్లు పూరీ కూడా ఒంటరి తనం ఫేస్‌ చేశాడట. ఒంటరితనం నుంచి బయటపడటం రాకపోతే అందులోనే  కూరుకుపోతామని, ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్‌ అయినప్పుడు మాత్రం ఒంటరిగా ఉండొద్దని, ఫ్రెండ్స్ తో గడపండని తెలిపారు. అంతేకాదు ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్‌ వినాలని, వర్కౌట్‌ చేయాలన్నారు. 

ఏకాంతం.. ఒంటరితనానికి పూర్తి విరుద్ధమన్నారు. ఏకాంతం కోసం ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన పనిలేదని, నీకున్న రీలేషన్స్, ఫ్రెండ్స్, లవ్‌, హెట్‌రెడ్‌.. ఇలా అన్నీ పక్కన పెట్టి మీతో మీరు కూర్చోవాలి. మన లైఫ్‌కి కావాల్సిన ముఖ్యమైన నిర్ణయాలు అప్పుడే తీసుకోవాలన్నారు. ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసి, రూమ్‌ తలుపేసి, నిలువెత్తు అద్దం ముందు నిలుచుని, ఆ అద్దంలో కనిపించే వ్యక్తిని సాంతం చూడండని చెప్పాడు. వాడి మీద మీకు చిరాకొస్తుందా? లేక ముద్దొస్తున్నాడా? మీకే అర్థమవుతుంది. 

దొరికిందల్లా తినకుండా, కసరత్తులు చేస్తే బాగుండు అనిపిస్తే.. వాడికి చెప్పండి. ఆ తర్వాత వాడితో కూర్చుని కళ్ళలో కళ్లు పెట్టి కాసేపు వాడినే చూస్తూ ఉండండి. ఇప్పటి వరకు ఏం చేశావు అని అద్దంలో కనిపించే వాడిని అడగండి. వాడేం సమాధానం చెబుతాడో జాగ్రత్తగా వినండి. కన్విన్సింగ్‌గా లేకపోతే ఒప్పుకోవద్దు. మీకున్న అన్ని అనుమానాలను వాడినే అడగండి. వాడి విజన్‌ ఏంటి, తర్వాత పదేళ్ళ కోసం వాడి దగ్గర ఏం ప్లాన్స్ ఉన్నాయో అడగండి. లేవు అంటే ఊరుకోవద్దు. పోనీ తర్వాత ఓ ఏడాది కోసం ప్లాన్‌ చెబుతాడేమో చూడండి. బిక్క మొహం వేస్తే అసలు సమస్య ఏంటో అడగండి. ఆ సమస్యల్ని అధిగమించడానికి వాడి బుర్ర పని చేయబోయే మీరే మంచి సలహా ఇవ్వండి. 

ఎందుకంటే ఈ భూమి మీదకి మీతో కలిసి వచ్చింది వాడే. పోయేటప్పుడు కూడా వాడే కంపెనీ. వాడిని కొంచెం మంచి దారిలో పెడదాం. వాడు ఎలాంటోడైనా మనకు తప్పదు కదా. వారానికొకసారి అయినా వాడితో కూర్చోండి. ఇద్దరు కలిసి మంచి మ్యూజిక్‌ వినండి. అప్పుడప్పుడు అద్దంలో ఉన్న వాడితో గడపండి. వాడిని ప్రేమించండి. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఇది చేయాలి. అప్పుడప్పుడు మనంతో మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే లోన్లీనెస్‌ భయంకరమైనది. ఎలోన్‌నెస్‌ జీవితంలో మార్పులు తీసుకొస్తుంది` అని పూరీ తన మ్యూజింగ్‌లో చెప్పారు. ఇది విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆద్యంతం స్ఫూర్తిని రగిల్చేలా పూరీ పలుకులకు మంచి ఆదరణ దక్కుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios