రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు అని అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి ఆడియెన్స్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మరింది. డ్యాషింగ్ డైరక్టర్ తో ఈ రౌడీ బాయ్ ఎలాంటి సినిమా చేస్తాడా? అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

అయితే సినిమా నుంచి ఏ ఎనౌన్స్మెంట్ వచ్చిన్నా అది ఆడియెన్స్ కిక్కించేలా ఉండాలని దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక టైటిల్స్ విషయంలో డిఫరెంట్ గా ఆలోచించే దర్శకుడు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కోసం ఒక మూడు మాస్ టైటిల్స్ ని అనుకున్నాడట. అందులో 'ఫైటర్' అనే టైటిల్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి సినిమా షూటింగ్ పనులను జనవరిలో మొదలుపెట్టాలని చూస్తున్నారు. 

ఒకసారి సినిమా మొదలయితే రెండే రెండు నెలల్లో పూర్తవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.