ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఎట్టకేలకు సక్సెస్ అందుకున్న డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నెక్స్ట్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో వర్క్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ రాబోతున్నట్లు.. ఎనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అందరిలో ఈ విషయమే హాట్ టాపిక్ గా మారింది. 

ఈ డిఫరెంట్ టెక్నీషియన్స్ ఎలాంటి సినిమాను ప్రజెంట్ చేస్తారో అని ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. అసలు మ్యాటర్ లోకి వెళితే... ప్రస్తుతం విజయ్ దేవరకొండ కోరిక మేరకు ప్రాజెక్ట్ లో దర్శకుడు కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే సినిమాలు వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని ఒక డేట్ ని టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే నవంబర్ లో రెండు సినిమాల షూటింగ్ లు అయిపోయే అవకాశం ఉందని అప్పుడే సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయవచ్చని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇక రూమర్స్ ప్రకారం ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఈ ప్రాజెక్ట్ సీక్వెల్ అని కామెంట్స్ వస్తున్నప్పటికీ చిత్ర యూనిట్ ఇంకా రూమర్స్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.