‘నన్ను దోచుకుందువటే’తో తెలుగు ఆడియన్స్‌ని తన యాక్టింగ్ టాలెంట్‌తో ఫిదా చేసిన నభా.. ఇస్మార్ట్ శంకర్‌కి పూర్తి కమర్షియల్ హీరోయిన్‌గా మారిపోయింది. పూరి జగన్నాథ్ సినిమాలలో ఉండే అగ్రిసెవ్‌నెస్‌ని పూర్తిగా అడాప్ట్ చేసుకొని తనను కొత్తగా ప్రజెంట్ చేసుకొన్న నభా ఇప్పుడు యూత్‌కి హార్ట్ త్రోబ్‌గా మారింది. దాంతో పూరినే ఆమెను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. 

మాస్ సినిమా కాన్సెప్టు కనుమరుగు అయ్యిపోతున్న టైమ్ లో వచ్చిన ఇస్మార్ట్ శంక‌ర్  భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. రిలైజే ఇన్ని రోజులు అయినా చాలా సెంటర్లలో దాని జోరు తగ్గలేదు.   ఈ చిత్రం కలెక్షన్లు చూస్తుంటే ట్రేడ్ షాక్ అవుతోంది.  రామ్ కెరీర్‌లో తొలి 75 కోట్ల గ్రాసర్‌గా నిలిచింది ఈ చిత్రం. 

కథంటూ పెద్దగా లేని ఈ సినిమా ఇంత హిట్ కారణం రామ్ ఫెరఫార్మెన్స్ తో పాటు  హీరోయిన్ నభా నటేష్ గ్లామర్ షో అని ఎవరైనా ఒప్పుకునే విషయమే. ఈ నేపద్యంలో పూరి జగన్నాథ్ తన తదుపరి చిత్రాన్ని నభాతోనే చేయాలని ఫిక్స్ అయ్యినట్లు సమాచారం. తక్కువ బడ్జెట్ లో ఆమెను ప్రధాన పాత్రలో పెట్టి ఓ థ్రిల్లర్ కథను పూరి తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. నభా కూడా ఉత్సాహంగా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని, ఇప్పటి వరకూ తెరకెక్కని ఐడియా అని చెప్తున్నారు. వర్కవుట్ అయితే కనుక ఇస్మార్ట్ స్దాయిలో దుమ్ము రేపుతుందిట. పూరి తన సొంతబ్యానర్ లోనే ఈ సినిమా చేయబోతున్నారు. 

ప్రస్తుతం నభా... రవితేజ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. డిస్కో రాజా టైటిల్ తో రూపొందే ఈ చిత్రం సైతం తనకు ఇస్మార్ట్  శంకర్ టైప్ లో నే పెద్ద హిట్ ఇస్తుందని భావిస్తోంది. ఈ సినిమా తర్వాత పూరి సినిమా పట్టాలు ఎక్కే అవకాసం ఉంది.