వరుస అపజయాల అనంతరం ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నెక్స్ట్ విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ కూడా సెట్ చేశారు. ఇక ప్రస్తుతం ఆ కథని ఫినిష్ చేసే పనిలో ఉన్న ఇస్మార్ట్ డైరెక్టర్ ఆ ప్రాజెక్ట్ ని ఈ ఏడాది ఎండింగ్ లో స్టార్ట్ చేయనున్నాడు. 

ఇకపోతే బాలకృష్ణతో కూడా పూరి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఫైటర్ అనంతరం వెంటనే మరో కథను మొదలుపెట్టాలని దర్శకుడు డిసైడ్ అయినట్లు టాక్. ఇకపోతే ప్రస్తుతం కెఎస్. రవికుమార్ సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య ఆ తరువాత బోయపాటి శ్రీనివాస్ తో మరో సినిమాను చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఇదివరకే బాలయ్యతో పైసా వసూల్ సినిమాను చేసిన బాలకృష్ణ అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయారు. 

అయినప్పటికీ పూరి జగన్నాథ్ తో మరో సినిమా చేయడానికి అయన రెడీ ఉన్నారు. యాక్షన్ డోస్ ని పెంచి బాలయ్య మార్క్ కి తగ్గట్టు మాస్ ఎలిమెంట్స్ ని కూడా సినిమాలో ఉండేలా చూసుకుంటున్నాడట. ప్రస్తుతం ఒక లైన్ ను అనుకున్న పూరి స్టోరీని డెవలప్ చేసి మరోసారి బాలకృష్ణకు వినిపించనున్నాడట. మరి ఆ ప్రాజెక్ట్ తో ఈ కాంబో ఎంతవరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.