ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ మహానాయకుడు నేడు వరల్డ్ వైడ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ఒకరోజు ముందే సినిమా స్పెషల్ ప్రీమియర్ షోను పలువురు సినీ ప్రముఖులు వీక్షించారు. అందులో పూరి జగన్నాథ్ కూడా ఉన్నారు. ఛార్మితో కలిసి సినిమాను చుసిన పూరి జగన్నాథ్ అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని తెలిపారు. 

పూరి చాలా ఎమోషనల్ అయినట్లు చెప్పేశారు. ఇకపోతే సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన ఇచ్చిన వివరణపై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. పూరి మీద ఉన్న కాస్త రెస్పెక్ట్ కూడా పోయిందంటూ ఓ వర్గం వారు కామెంట్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ బాలయ్యతో పైసా వసూల్ సినిమాతో బాగా దగ్గరయ్యారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా వారి మధ్య స్నేహం అలానే ఉంటుందని పూరి చాలా సార్లు చెప్పాడు. 

ఇక సినిమా చూడగానే బసవతారకంకి సంబందించిన సన్నివేశాలను చూసి ఎమోషనల్ అయిపోయి ఏడ్చాను అంటూ రామారావు గారికి జరిగిన అవమానాలను చూసి ఎక్కెక్కి ఏడ్చానని అన్నారు ఇక ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ లో ఎప్పుడు ఏడవలేదని ఆయన కెరీర్ లో మహానాయకుడు ది బెస్ట్ ఫిల్మ్ అవుతుందని అన్నారు. నిజానికి మహానాయకుడు సినిమాపై ప్రస్తుతం వస్తోన్న రేటింగ్స్ చుస్తే..  బాలయ్యకు నచ్చినట్లు చంద్రబాబు మెచ్చుకునేట్లు సినిమాను తెరకెక్కించారని కథనాలు వెలువడుతున్నాయి. 

అయితే ఎమోషనల్ పరంగా సినిమాను బాగానే తెరకెక్కించినా అసలైన కాంట్రవర్సీ కథ మిస్ అవ్వడంతో దీన్ని బయోపిక్ అంటారా ? అని కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో పూరి చేసిన కామెంట్స్ మరింత వైరల్ అవుతున్నాయి. ఏం పూరిగారు సినిమా అంత ఏడిపించేసిందా? అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.