పూరి జగన్నాథ్ సోదరుడు ఉమా శంకర్ గణేష్ నర్సీపట్నం అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంపై దర్శకుడు పూరి కొద్దీ సేపటి క్రితం స్పందించారు. ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అందుకు జగన్ కు రుణపడి ఉంటామని ఒక లేఖ ద్వారా తెలియజేశారు. 

ఉమా శంకర్ వైసిపి అభ్యర్థిగా గత ఎలక్షన్స్ లో కూడా పోటీ చేసినప్పటికీ గెలవెలకపోయారు. మరోసారి జగన్ ఆయనకు అవకాశం ఇవ్వడంతో యుద్ధంలోకి మళ్ళీ తీసుకువచ్చి తన సోదరుడి గెలుపులో జగన్ కీలకపాత్ర పోషించారని పూరి తెలిపారు. అదే విధంగా జగన్ విజయంపై కూడా పూరి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా మీటింగ్ పెట్టుకొని మరి జగన్ ని గెలిపించారని ఇంతటి భారీ విజయం అందుకోవడం చాలా గ్రేట్ అని అన్నారు. అదే విధంగా బారి మెజారిటీతో గెలిచినప్పటికీ జగన్ మొహంలో ఎలాంటి విజయ గర్వం కనిపించలేదని రాజన్న కొడుకు అనిపించుకున్నారని అంటూ గ్రేట్ వారియర్ అని సంబోధించారు.