`నీ పుట్టుకే ఓ యుద్ధం.. ఎన్నో యుద్ధాలు చేస్తేగానీ పుట్టలేదు..సక్సెస్‌ పెద్ద లెక్క కాదు` అని అంటున్నారు డేరింగ్‌, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌. లాక్‌ డౌన్‌ టైమ్‌లో కాస్త ఫ్రీగా ఉన్న పూరీ సమాజంలోని అనేక అంశాలను, తన ఆలోచనలను పంచుకుంటున్నారు. 

పూరీ మ్యూజింగ్స్  పేరుతో ఆయన ఒక్కో అంశంపై తన అభిప్రాయాలను షేర్‌ చేస్తున్నారు. తాజాగా సక్సెస్‌ గురించి చెప్పారు. ఆయన మాట్లాడుతూ, జీవితంలో చాలా సార్లు నిరాశకు గురవుతాం. సక్సెస్‌ రావడం లేదని బాధపడుతుంటాం. అందరూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం ఏమీ సాధించలేకపోతున్నానని బాధపడుతుంటాం. ఈ విషయం చెప్పడానికి ముందు మన పుట్టుక గురించి మాట్లాడుకోవాల`న్నారు. 

`ఈ భూమి మీద ఎన్నో కోట్ల మంది పుట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. రోజూ కొన్ని కోట్ల వీర్యకణాలు వృథాగా పోతుంటాయి. అందమైన అమ్మాయిలు కూడా పుట్టుకుండానే నలిగిపోతున్నారు. కానీ మీరు ఎన్నింటినో అధిగమించి ఈ భూమి మీదకు వచ్చారు. పుట్టుకతోనే మీరు విజేత. పుట్టడానికే బోలెడు యుద్ధాలు చేసిన మీకు సక్సెస్‌ ఓ లెక్కా.. సక్సెస్‌ మీ డీఎన్‌ఏలో ఉంది. అది మీ ఇంటిపేరు, ఈ రోజు కాకపోతే రేపు వస్తది సక్సెస్‌. నువ్వు చూడందా ఏంటి?` అని తెలిపారు.  ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ వీడియోని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంటుంది. 

View this post on Instagram

‪👉 https://youtu.be/hdfHvKZBZrQ @charmmekaur #PC

A post shared by Puri Connects (@puriconnects) on Sep 23, 2020 at 10:57pm PDT