డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొత్త మూవీ ప్రకటన చేశారు. రామ్ పోతినేని హీరోగా డబల్ ఇస్మార్ట్ టైటిల్ తో మూవీ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు.  


డైరెక్టర్ పూరి జగన్నాథ్-రామ్ పోతినేని మూవీ చేస్తున్నట్లు ఇప్పటికే సమాచారం ఉంది. నేడు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి డబల్ ఇస్మార్ట్ అనే టైటిల్ నిర్ణయించారు. చిత్ర ప్రకటన రోజే విడుదల తేదీ ఫిక్స్ చేశారు. 2024 మార్చి 8న విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కొట్టింది. ఆ మూవీ వరల్డ్ వైడ్ రూ. 75 కోట్ల గ్రాస్ రాబట్టింది. నాలుగేళ్ళ తర్వాత ఈ కాంబోలో మూవీ తెరకెక్కుతుంది. 

టైటిల్ చూస్తుంటే ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి డబల్ ఇస్మార్ట్ సీక్వెల్ అనిపిస్తుంది. కలిసొచ్చిన సబ్జెక్టుతో హిట్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా పాన్ ఇండియా మూవీ అంటూ ప్రకటించారు. డబల్ ఇస్మార్ట్ ఐదు భాషల్లో విడుదల కానుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఛార్మి-పూరి నిర్మిస్తున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. 

Scroll to load tweet…
Scroll to load tweet…

ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ పోతినేనికి హిట్ లేదు. అలాగే పూరి జగన్నాధ్ లైగర్ మూవీతో మొత్తంగా మునిగారు. దీంతో మరోసారి ఇద్దరూ జతకట్టారు. డబల్ ఇస్మార్ట్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. హిట్ కాంబినేషన్ కావడంతో హైప్ ఏర్పడుతుంది. చెప్పాలంటే పూరి జగన్నాథ్ కి ఇది చివరి ఛాన్స్. డబల్ ఇస్మార్ట్ తో ఆయన ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక రామ్ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా మూవీనే కావడం విశేషం.