ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా చిత్రాన్ని తెరకెక్కించారు. తనతో పాటు, పరుచూరి బ్రదర్స్ ఎన్నో ఏళ్లుగా ఈ చిత్రాన్ని తెరక్కించాలని ప్రయత్నించినట్లు ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ తెలిపారు. రాంచరణ్ దాదాపు 250 కోట్ల బడ్జెట్ లో, సురేందర్ రెడ్డి దర్శకుడిగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 

ఇటీవల విడుదలైన సైరా టీజర్, ట్రైలర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అభిమానులతో పాటు సినీ ప్రముఖుల్లో సైతం సైరా పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఓ వీడియో విడుదల చేసి మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, సైరా చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపాడు. 

కొన్నేళ్ల క్రితం రాంచరణ్ నాకో మాట చెప్పాడు. నాన్న గారితో అద్భుతమైన చిత్రం తీయాలి. ఆ చిత్రం మనమంతా గర్వపడేలా ఉండాలి అని అన్నాడు. నేను సైరా టీజర్ చూడగానే రాంచరణ్ చెప్పిన మాటే గుర్తుకు వచ్చింది. దర్శకుడు సురేందర్ రెడ్డి అదరగొట్టారు. ఎనర్జీతో మెగాస్టార్ ని కొట్టేవాడు పుట్టలేదు. లవ్యూ అన్నయ్యా.. ఒక అభిమానిగా సైరా చిత్రం ఘనవిజయం సాధించాలని శుభాకాంక్షలు చెబుతున్నా అని పూరి తెలిపారు. 

సైరా చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా సైరా చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.