నందమూరి బాలకృష్ణ అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో కొనసాగుతున్నారు. బాలకృష్ణ గురించి తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. అభిమానులపై ఎన్నోసార్లు ఆయన చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అభినులనే కొడతాడు అంటూ సోషల్ మీడియాలో బాలయ్యపై ట్రోలింగ్ కూడా జరిగింది. దీనిపై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. 

బాలయ్య అందరిని కొట్టేస్తాడు అని అంటుంటారు. ఈ విషయం గురించి నేను వివరణ ఇవ్వాలి. పబ్లిక్ లోకి హీరోయిన్లు వెళ్ళినప్పుడు మీద పడిపోయే ఆకతాయిలు ఉంటారు. హీరోయిన్లకు మాత్రమే కాదు.. హీరోలకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఎవడు ఏ వైపు నుంచి వచ్చి మీదపడిపోతాడో తెలియదు. 

అందుకే ప్రమాదకరంగా తన మీదకు వచ్చే వాళ్ళని బాలయ్య కొడుతుంటారు. మిగిలిన హీరోలు ఈ పని చేయరు కాబట్టి బాలయ్య మాత్రమే అందరికి కోపిష్టిలా కనిపిస్తున్నారు. వాస్తవానికి ఆయన చాలా మంచి వ్యక్తి అని పూరి బాలయ్యని సమర్థించారు. 

పూరి జగన్నాధ్, బాలకృష్ణ కాంబినేషన్ లో పైసా వసూల్ చిత్రం వచ్చింది. ఆ చిత్రం నిరాశపరిచింది.