చాలా రోజుల తర్వాత పూరి జగన్నాధ్ కు మంచి మాస్ హిట్ పడ్డట్లే కనిపిస్తోంది. గురువారం రోజు విడుదలైన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి, సినీ విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరక్కించారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. 

ఇస్మార్ట్ శంకర్ చిత్రం విజయం సాధించినందుకు రాంగోపాల్ వర్మ తన శిష్యుడిని అభినందించారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించాలని సూచించాడు. ఈ మేరకు వర్మ పూరి జగన్నాధ్ కు టైటిల్ కూడా సూచించాడు. 'ట్రిపుల్ ధిమాఖ్' పేరుతో సీక్వెల్ తెరక్కించాలని వర్మ ట్వీట్ చేయగా పూరి దానికి సమాధానం ఇచ్చాడు. 

ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కు తాను ఆల్రెడీ ఓ టైటిల్ ఫిక్స్ అయిపోయానని పూరి తెలిపాడు. సర్.. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కు ఆల్రెడీ టైటిల్ రిజిస్టర్ చేయించా. 'డబుల్ ఇస్మార్ట్' పేరుతో ఈ చిత్రం ఉండబోతోందని పూరి ఆసక్తికర ప్రకటన చేశాడు. హీరో రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో చాలా కాలం తర్వాత హిట్ దక్కింది. నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించాడు.