మెగా స్టార్ చిరంజీవి వీరాభిమనినని, సినిమా చేయందే వదలనని అంటున్న పూరీ గతంలో ఆటోజానీ పేరుతో వచ్చిన ప్రపోజల్ రద్దు బాలయ్య సినిమా తర్వాత చిరంజీవితో చేయనున్న పూరీ
మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానమున్న దర్శకులు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. ఇటీవల కాలంలో మెగాస్టార్‌ను డైరెక్ట్ చేయాలని ప్రయత్నిస్తున్న వారిలో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకరు. గతంలో మెగాస్టార్ 150వ చిత్రానికి పూరి డైరెక్టర్ అనే టాక్ వినిపించింది. అయితే ఎందుకో ఆ ప్రయత్నం సఫలం కాలేదు. కానీ పూరీ ఇటీవలే చిరంజీవితో సినిమా చేస్తానని బల్లగుద్ది చెప్పడం గమనార్హం.
మెగాస్టార్ రీ ఎంట్రీకి మంచి కథ కోసం ఎదురుచూస్తుండగా పూరి జగన్నాథ్ ఓ కథ చెప్పాడు. అప్పట్లో “కథలో ఫస్టాఫ్ మెగాస్టార్‌కు బాగా నచ్చింది. సెకండాఫ్ కొంత సందిగ్ధత ఉంది” అని పూరి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు చిరంజీవి రీఎంట్రీకి పూరీయే దర్శకుడు అని ప్రచారం జరిగింది. ఆ చిత్రానికి టైటిల్ ఆటో జానీ అని మీడియాలో నానింది. కానీ అనూహ్యంగా కత్తి రీమేక్‌కు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పూరీ ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నా అభిమాన హీరో చిరంజీవితో తప్పకుండా సినిమా చేస్తా అని ఇటీవల మరోసారి పూరీ జగన్నాథ్ ధీమా వ్యక్తం చేశాడు. ఆ చిత్రంలో మెగాస్టార్ అంటే ఏమిటో ఆ సినిమాలో చూపిస్తాను. మెగాస్టార్ అసలు నట విశ్వరూపం అనేది ఇదే అనే విధంగా ఉంటుంది అని సవాల్ చేసినంత పనిచేశాడు పూరీ.
చిరంజీవి అంటే నాకు చెప్పలేనంత అభిమానం అనిస ఇటీవలే మీడియా ముందు కూడా చెప్పాడు పూరీ. చిన్నతనంలో చిరంజీవి సినిమా చూడ్డానికి క్యూ లైన్లలో నిలబడి టికెట్లు కొనేవాడిని. సినిమా హాళ్ల వద్ద కటౌట్లు కూడా కట్టేవాడిని అని పూరీ చెప్పుకోచ్చాడు దూరం నుంచి చూసేవాడిని దర్శకుడిని కావాలన్న కోరికతో హైదరాబాద్ వచ్చిన సమయంలో చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతుంటే దూరం నుంచి ఆయనను చూసేవాడిని. చిరంజీవిని అంతగా అభిమానించే తనకు.ఆయనతో ఓ బ్లాక్ బస్టర్ మూవీ తీయాలనే కసి ఉంటుంది కదా అని అభిమానులు ఆనందించే వార్తను జగన్నాథ్ చెప్పారు.
ఇక ప్రస్థుతం పూరీ బాలకృష్ణ 101వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
