Puneeth rajkumar death:గుండె బద్దలైందన్న ఎన్టీఆర్... పునీత్ రాజ్ కుమార్ కోసం పాడిన పాట ఏంటంటే?
Puneeth rajkumar నటించిన ఓ చిత్రంలోని పాటను ఎన్టీఆర్ స్వయంగా పాడారు. 2016లో ఎమ్ శరవణన్ దర్శకత్వం లో యాక్షన్ ఎంటర్టైనర్ చక్రవ్యూహ మూవీ విడుదలైంది.
టాలీవుడ్ స్టార్స్ తో పునీత్ రాజ్ కుమార్ ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. వారిలో ఎన్టీఆర్ చాలా ప్రత్యేకం.తల్లి ద్వారా ఎన్టీఆర్ కి కర్ణాటక రాష్ట్రంతో సంబంధాలు ఉన్నాయి. Ntr కన్నడ అద్భుతంగా మాట్లాడగలరు. దీనితో అక్కడి సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో ఎన్టీఆర్ కి స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడింది. కర్ణాటకలో ఎన్టీఆర్ సినిమాల ప్రమోషన్స్ ఈవెంట్స్ లో పునీత్ రాజ్ కుమార్ పాల్గొనేవారు. అలాగే పునీత్ ఏ విషయమై హైదరాబాద్ వచ్చినా, ఎన్టీఆర్ ఆయనను కలిసేవారు.
ఈ క్రమంలో Puneeth rajkumar నటించిన ఓ చిత్రంలోని పాటను ఎన్టీఆర్ స్వయంగా పాడారు. 2016లో ఎమ్ శరవణన్ దర్శకత్వం లో యాక్షన్ ఎంటర్టైనర్ చక్రవ్యూహ మూవీ విడుదలైంది. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించారు. గెలయా గెలయా.. అంటూ సాగే ఓ జోష్ ఫుల్ సాంగ్ ని ఎన్టీఆర్ స్వయంగా పాడడం జరిగింది. ఎన్టీఆర్ పాడిన Geleya geleya సాంగ్ అద్భుతంగా వచ్చింది. పునీత్ రాజ్ కుమార్ డాన్స్ పెర్ఫార్మన్స్ అంతకు మించి ఉండగా, చక్రవ్యూహ చిత్రంలో ఆ పాట ప్రత్యేకంగా నిలిచింది.
Also read పునీత్ మరణ వార్త హార్ట్ బ్రేక్ అయ్యిందంటున్న తారలు.. మోహన్‌బాబు, మహేష్, ఎన్టీఆర్..స్టార్స్ సంతాపం
ఎన్టీఆర్ వలె పునీత్ రాజ్ కుమార్ కూడా మల్టీ టాలెంటెడ్ కావడం విశేషం.ఆయన ప్రొఫెషనల్ సింగర్ కూడాను. బాల సుబ్రహ్మణ్యం వంటి లెజెండ్స్ తో కలిసి పాడిన పునీత్ రాజ్ కుమార్, కెరీర్ లో యాభైకి పైగా పాటలు పాడారు. సింగర్ గా అవార్డ్స్ కూడా అందుకోవడం జరిగింది. అలాంటి మిత్రుడు మరణ వార్త ఎన్టీఆర్ ని కలచివేసింది. 'గుండెబద్దలైంది.. నీవు ఇంత త్వరగా వెళ్లిపోయావన్న విషయం నమ్మలేకున్నా' అంటూ.. ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.
Also read అధికార లాంఛనాలతో పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలుః కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై
నేడు ఉదయం గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్ మరణించగా... అభిమానులు శోక సముద్రంలో మునిగిపోయారు. దేశవ్యాప్తంగా ఉన్న చిత్ర ప్రముఖులు ఆయన మృతిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ట్వీట్ ద్వారా స్పందించారు. పునీత్ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు గా అభివర్ణించారు. రేపు పునీత్ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. తండ్రి రాజ్ కుమార్ వలె, పునీత్ మరణానికి ముందు తన కళ్ళను దానం చేసినట్లు సమాచారం.