బిగ్ బాస్ హౌస్ లో ఎఫైర్లు కామన్. షో టీఆర్పీ రేటు పెంచడానికో లేక నిజంగానే రిలేషన్షిప్ మైంటైన్ చేస్తారో కానీ షోలో మాత్రం హాట్ సీన్లు కామన్ అయిపోయాయి. కానీ తెలుగు బిగ్ బాస్ లో మాత్రం ఇలాంటి సీన్లు పెద్దగా కనిపించలేదు. కానీ మొదటిసారి రాహుల్, పునర్నవిల రిలేషన్షిప్ చూసి జనాలకు అనుమానం వస్తోంది.

అయితే ఇది కేవలం హౌస్ కే పరిమితమా..? లేక వారిద్దరూ నిజంగానే క్లోజ్ అవుతున్నారా..? అనేది తేలాల్సివుంది. కానీ రోజురోజుకి వారిద్దరూ క్లోజ్ అవుతున్నారనే విషయం బిగ్ బాస్ ఫాలో అయ్యేవాళ్లకు అర్ధమవుతూనే ఉంది.

నాగార్జున కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా హౌస్ లో జరిగిన ఓ టాస్క్ లో వీరిద్దరి బంధం మరింత బలపడింది. కేవలం వీరిద్దరినీ టార్గెట్ చేస్తూ ఓ టాస్క్ డిజైన్ చేశాడు బిగ్ బాస్. పునర్నవి కోసం రాహుల్ ఇరవై గ్లాసుల కాకరకాయ జ్యూస్ తాగాడు. వాంతులు చేసుకుంటూ మరీ జ్యూస్ తాగేశాడు. ఈ టాస్క్ తో పునర్నవికి రాహుల్ పై ఇష్టం మరింత పెరిగిపోయింది. అతడిని గట్టిగా కౌగిలించుకొని ఘాటైన ముద్దు కూడా పెట్టేసింది.

ఈ ఒక్క ముద్దు వీరి రిలేషన్షిప్ పై అనుమానాలను పెంచేస్తోంది. ఇదంతా షో కోసం చేశారా..? లేక వీరిద్దరూ నిజంగానే దగ్గరయ్యారా..? అనే విషయం సస్పెన్స్ గానే ఉంది. అయితే పునర్నవి మాత్రం తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని.. చాలా కాలంగా తనతో రిలేషన్ లో ఉన్నట్లు చెప్పింది. ఆ ప్రకారం చూసుకుంటే రాహుల్ తో రిలేషన్ కేవలం షో వరకే పరిమితం చేయొచ్చు!