తెలుగు నటి‌, బిగ్‌బాస్‌3 ఫేమ్‌ పునర్నవి భూపాలం పెళ్ళి ఫిక్స్ అయ్యింది. ఫైనల్‌గా తాను మ్యారేజ్‌ చేసుకోబోతున్నట్టు వెల్లడించింది. ఈ సందర్బంగా రింగ్‌ తొడుకున్న ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. 

ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్టు చెప్పకనే చెప్పింది. పునర్నవి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ, `మొత్తానికి ఇది జరిగింది` అని పేర్కొంది. ఈ సందర్భంగా ఓ ఫోటోని పంచుకుంది. ఇందులో తన చేయిని మరో చేయి పట్టుకుని ఉంది. అందులో పునర్నవి వేలికి రింగ్‌ తొడిగి ఉంది. అయితే తాను చేసుకోబోయే వ్యక్తి ఎవరనేమాత్రం వెల్లడించలేదు. 

ఇదిలా ఉంటే `బిగ్‌బాస్‌3` టైమ్‌లో పునర్నవికి, సీజన్‌ విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ మధ్య లవ్‌ ట్రాక్‌ జరిగింది. వీరిద్దరు మ్యారేజ్‌ చేసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి.  పలు ఇంటర్వ్యూల్లో వీరిద్దరికీ ఇదే ప్రశ్న ఎదురైంది. కానీ ఇద్దరూ అలాంటిదేమీ లేదని, తాము స్నేహితులమని చెబుతూ వచ్చారు. ఇప్పుడు పునర్నవి ఏకంగా తన పెళ్ళిని ప్రకటించేసింది. మరి వరుడు ఎవరు? ఆమె ఎవర్ని మ్యారేజ్‌ చేసుకోబోతున్నందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Finally! It's happening 🥰❤️

A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on Oct 28, 2020 at 5:03am PDT

పునర్నవి భూపాలం `ఉయ్యాలా జంపాలా`, `మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు`, `పిట్టగోడ`, `మనసుకు నచ్చింది`, `ఎందుకు ఏమో`, `ఒక చిన్న విరామం`, `సైకిల్‌` చిత్రాల్లో నటించింది.