ఏదైనా కొత్తగా చేస్తేనే జనాల దృష్టి మనవైపు తిప్పుకోగలం. రొటీన్ గా చేస్తే ఎవరూ పట్టించుకోరు. ఈ విషయం బాగా వంట బట్టించుకున్న సినిమా వాళ్ళు ప్రేక్షకుల అటెంషన్ కోసం అనేక మార్గాలలో ట్రై చేస్తూ ఉంటారు. బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాళం ఇప్పుడు అదే చేసింది, తన సినిమా ప్రమోషన్ కోసం ఎంగేజ్మెంట్ డ్రామా ఆడింది. ఎంగేజ్మెంట్ రింగ్ ధరించిన పునర్నవి ఓ అబ్బాయి ఫొటోతో పాటు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. అలాగే నేడు ఉద్భవ్ రఘునందన్ తో కలిసి ఓ బిగ్ న్యూస్ పంచుకోనున్నట్లు కామెంట్ పెట్టింది. 

దీనితో మీడియా వాళ్ళు పునర్నవి ఉధ్బవ్ తో నిశితార్థం జరుపుకుందని, శుక్రవారం పెళ్లి ప్రకటన చేయనున్నారని  భావించారు. తీరా చూస్తే ఇది కేవలం సినిమా ప్రమోషన్ కోసం వేసిన ట్రిక్ అని స్పష్టం అయ్యింది. పునర్నవి, ఉద్భవ్ జంటగా కమిట్ మెంటల్ అనే ఓ మూవీలో నటించారు. ఈ మూవీ ఆహా యాప్ లో నవంబర్ 13న స్ట్రీమ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం పునర్నవి అందరినీ పక్కదోవ పట్టించింది. 

పునర్నవి స్నేహితుడిగా రాహుల్ కూడా ఇందులో భాగం అయ్యాడు. పునర్నవి ఎంగేజ్మెంట్ ని ఉద్దేశిస్తూ పరోక్షంగా రాహుల్ సోషల్ మీడియా పోస్ట్లు పెట్టాడు. నిజంగా పునర్నవి ఎంగేజ్మెంట్ జరుపుకుంది..అందుకే గతంలో పునర్నవి లవర్ గా ఉన్న రాహుల్ ఫీలవుతున్నాడని అందరు భావించారు. తీరా నేడు పునర్నవి ఇది కేవలం తన కొత్త మూవీ ప్రమోషనల్ స్టంట్ అని తేల్చివేసింది.