పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న పిఎస్.పికె25 చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన నేపథ్యంలో.. తాజాగా ఈ కాంబినేషన్ లో రాబోతోన్న మరో మూవీపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఆడియో డిసెంబర్ నెలలో రిలీజ్ కానుందని అనుకున్నాం. తాజాగా ఫిలింనగర్ నుంచి వినిపిస్తున్న అప్‌డేట్స్ ప్రకారం డిసెంబర్ 14వ తేదీన పీఎస్‌పీకే25 సినిమా ఆడియో విడుదల కార్యక్రమం వుండే అవకాశాలున్నాయని తెలుస్తోంది.ప్రస్తుతం త్రివిక్రమ్-పవన్ అండ్ టీమ్ యూరప్‌లో సినిమా షూటింగ్‌లో బిజీగా వుంది. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి కావచ్చినట్టవుతుంది. ఆ తర్వాత ఎలాగూ ఇక పూర్తిస్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్‌పై దృష్టి పెట్టడమే మిగిలివుంటుంది కనుక డిసెంబర్ 14న జరపబోయే ఆడియో లాంచింగ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేస్తోందట సినిమా యూనిట్.

 

అందులోనూ ఈ సినిమాకు ఓ ప్రత్యేకత వుంది. తమిళంలో సంచలనాలు సృష్టించిన యువ సంగీత కెరటం అనిరుధ్ ఈ సినిమాతోనే టాలీవుడ్‌కి పరిచయం అవబోతున్నాడు. ఆడియో లాంచింగ్ ఫంక్షన్ అంటేనే ముఖ్యంగా మ్యూజిక్ కంపోజర్స్‌కి సంబంధించి ఓ ఫెస్టివల్ లాంటిది. అందుకే ఈ ఆడియో లాంచింగ్ ఫంక్షన్ అన్ని ఇతర ఆడియో రిలీజింగ్ ఫంక్షన్స్‌ తో పోలిస్తే మరింత ఎట్రాక్టివ్ గా నిర్వహించనున్నారనే టాక్ వినిపిస్తోంది.