పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 27వ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఈ మూవీ షూటింగ్ మొదలు కాగా, లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది. ఇటీవలే క్రిష్ ఈ చిత్రాన్ని తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లారు . పవన్ నటిస్తున్న మొట్టమొదటి పీరియాడిక్ డ్రామా కావడంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఇది కూడా ఒకటి. 

ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్ బందిపోటు వలె కనిపించనున్నాడని సమాచారం. మొఘలుల కాలం నాటి యాక్షన్ డ్రామాగా భారీ ఎత్తున నిర్మాత ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పై అప్డేట్ ఇచ్చారు చిత్ర బృందం. శివరాత్రి కానుకగా  మార్చ్ 11న పవన్ 27వ చిత్ర టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. దీనితో పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

గతంలో ఈ మూవీ ప్రీ లుక్ విడుదల చేశారు. నడుముకు ఎర్రకండుగా కట్టుకొని, చేతికి కడియం, నడుము వద్ద గ్రద్ద లాకెట్ ధరించి ఉన్న పవన్ ప్రీ లుక్ ఆకట్టుకుంది. మరి మార్చ్ 11న విడుదల కానున్న ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఇక ఈ మూవీలో నిధి అగర్వాల్, జాక్విలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 

మరో వైపు పవన్ అయ్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రీమేక్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. ఈ రెండు చిత్రాలను ఆయన ఏక కాలంలో పూర్తి చేస్తున్నారు. వీటి తరువాత పవన్ హరీష్ శంకర్, సురేంధర్ రెడ్డి చిత్రాలలో నటించాల్సి ఉంది.